Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు విషయంపై కూటమిలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు సోమవారం భేటీ అయ్యారు.

ఈ భేటీలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్‌, వంశీ కృష్ణ, చిల్లపల్లి శ్రీనివాస్‌ తదితరులు కూడా హాజరయ్యారు.

ఇంతకుముందు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో ఏయే ప్రాంతాల్లో ఏ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించాలనే అంశంపై విస్తృతంగా చర్చించారు. ఆ చర్చల కొనసాగింపుగా తాజాగా పవన్‌ కల్యాణ్‌తో కూటమి నేతలు మరోసారి సమావేశమై సీట్ల పంపిణీపై మాట్లాడుకున్నారు.

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సామరస్యంతో సీట్లు పంచుకోవాలనే దిశగా చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది.

Tags: