CM Chandrababu: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. శనివారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ కానున్నారు.

పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, పీఆర్సీ, డీఏ బకాయిలు తదితర అంశాలపై చర్చ జరగనుంది. గురువారం ఏపీ జేఏసీ నేతలు ఎ. విద్యాసాగర్, డీవీ రమణ, భారతీ ప్రసాద్ తదితరులు సీఎం చంద్రబాబును కలిశారు. ఉద్యోగుల ఆందోళనలు, పెండింగ్‌లో ఉన్న సమస్యలపై వివరాలు తెలిపి పరిష్కారం చూపాలని కోరారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా న్యాయంగా చేయాల్సినవి ఒక్కొక్కటిగా చేస్తున్నామని తెలిపారు. చర్చలు జరుగుతున్నా తొందరపడవద్దని, ఓర్పు పట్టాలని సూచించినట్లు సమాచారం. జేఏసీ నాయకులు కూడా చర్చలను ఆహ్వానిస్తున్నామని, ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు.

Tags: