Nara Lokesh’s Emotional Speech: నారా లోకేష్ ఎమోషనల్ స్పీచ్: నా విజయానికి వారే కారణం.. గురువులను ఎప్పటికీ మరచిపోకూడదు

నా విజయానికి వారే కారణం.. గురువులను ఎప్పటికీ మరచిపోకూడదు

Update: 2025-12-13 13:07 GMT

Nara Lokesh’s Emotional Speech: జీవితంలో విలువలు చాలా ముఖ్యమని, విద్యార్థులు వాటిని కచ్చితంగా ఆచరణలో పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఎర్రపాలెం గ్రామంలో డాన్ బాస్కో పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పాఠశాల స్థాపనకు 50 సంవత్సరాలు పూర్తి కావడంతో శిలాఫలకాన్ని ఆవిష్కరించిన లోకేష్.. నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. పాఠశాల వ్యవస్థాపకుడు ఫాదర్ చిన్నప్ప విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి లోకేష్.. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తాను ఈ రోజు ఈ స్థాయికి ఎదగడానికి తన ఉపాధ్యాయురాలు మంజుల, గురువులు నారాయణ, రాజిరెడ్డి కారణమని ఎమోషనల్‌గా పేర్కొన్నారు. "విద్యార్థులు ఎంత ఎత్తుకు ఎదిగినా.. తమకు జ్ఞానం అందించిన ఉపాధ్యాయులను ఎన్నటికీ మరచిపోకూడదు" అని సలహా ఇచ్చారు.

అనంతరం పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన ఫాదర్లను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:    

Similar News