Kia Seltos : పాత సెల్టోస్‌ను మర్చిపోవాల్సిందే.. కియా నుంచి నయా అస్త్రం

కియా నుంచి నయా అస్త్రం

Update: 2025-12-29 07:34 GMT

Kia Seltos : కియా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ సెల్టోస్‎లో సరికొత్త మార్పులు చేస్తూ 2026 వెర్షన్‌ను సిద్ధం చేసింది. పాత సెల్టోస్‌ను మర్చిపోయేలా, సరికొత్త డిజైన్, అదిరిపోయే టెక్నాలజీతో వస్తున్న ఈ కారు జనవరి 2, 2026న భారత మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. కేవలం రూ.25,000 టోకెన్ అమౌంట్‌తో ఈ మోడ్రన్ ఎస్‌యూవీని సొంతం చేసుకోవడానికి జనం క్యూ కడుతున్నారు.

సైజులో పెరిగింది.. స్పేస్‌లో మెరిసింది: కొత్త తరం 2026 కియా సెల్టోస్ పాత మోడల్ కంటే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇది పాత కారు కంటే 95 మిమీ పొడవుగా, 30 మిమీ వెడల్పుగా మారింది. వీల్‌బేస్ కూడా 80 మిమీ పెరగడం వల్ల కారు లోపల లెగ్‌రూమ్ చాలా మెరుగ్గా ఉంటుంది. కేవలం క్యాబిన్ మాత్రమే కాదు, బూట్ స్పేస్ (డిక్కీ) కూడా 14 లీటర్లు అదనంగా పెరిగింది. దీనివల్ల ఫ్యామిలీతో కలిసి ప్రయాణించేటప్పుడు లగేజీ సర్దుకోవడం చాలా సులభం అవుతుంది. అలాగే 200 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో బ్యాడ్ రోడ్లపై కూడా ఇది సునాయాసంగా వెళ్ళిపోతుంది.

ఈసారి కియా తన డిజైన్ లాంగ్వేజీని పూర్తిగా మార్చేసింది. నిలువుగా ఉండే ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, సరికొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లతో ఇది చాలా అగ్రెసివ్ లుక్‌ను ఇస్తుంది. అయితే ఇందులో హైలైట్ మాత్రం మోటరైజ్డ్ ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్. లగ్జరీ కార్లలో మాత్రమే కనిపించే ఈ ఫీచర్ ఇప్పుడు సెల్టోస్‌లో రాబోతోంది. కారు దగ్గరికి వెళ్లగానే హ్యాండిల్స్ బయటకు వస్తాయి, ప్రయాణం మొదలవగానే లోపలికి వెళ్లిపోతాయి. ఇది కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

కారు లోపల టెక్నాలజీని చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. పాత మోడల్‌లో ఉన్న 10.25 ఇంచుల స్క్రీన్ స్థానంలో ఇప్పుడు 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వస్తున్నాయి. అంతేకాదు క్లైమేట్ కంట్రోల్ కోసం సెంటర్ కన్సోల్‌పై మరో 5.0 ఇంచుల ప్రత్యేక టచ్‌స్క్రీన్ ప్యానల్ కూడా ఉంటుంది. అంటే మొత్తం మూడు స్క్రీన్లతో కారు ఇంటీరియర్ ఒక స్పేస్‌షిప్‌లా కనిపిస్తుంది.

సాధారణంగా కార్లలో ముందు, వెనుక పార్కింగ్ సెన్సర్లు ఉంటాయి. కానీ కొత్త సెల్టోస్‌లో సైడ్ పార్కింగ్ సెన్సర్లు కూడా ఉన్నాయి. ఇవి కారుకు రెండు పక్కల ఉండే అడ్డంకులను గుర్తిస్తాయి. ఇరుకైన సందుల్లో లేదా టైట్ పార్కింగ్ స్పేస్‌లలో కారును పార్క్ చేసేటప్పుడు ఇది డ్రైవర్‌కు ఎంతో సహాయపడుతుంది. దీనికి తోడు అప్‌గ్రేడెడ్ లెవల్-2 ADAS ఫీచర్లు కారు ప్రయాణాన్ని మరింత సురక్షితం చేస్తాయి.

లాంగ్ డ్రైవ్స్ చేసే వారికి వెన్నునొప్పి సమస్య రాకుండా ఉండటానికి కియా ఈసారి 10-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్‌ను అందించింది. ఇందులో పవర్డ్ లంబార్ సపోర్ట్ కూడా ఉంది. మీ సౌకర్యానికి అనుగుణంగా సీటును అడ్జస్ట్ చేసుకోవచ్చు, తద్వారా సుదూర ప్రయాణాల్లో కూడా డ్రైవర్ అలసిపోకుండా ఉంటారు. ధర విషయానికొస్తే ఈ కొత్త సెల్టోస్ సుమారు రూ.12 లక్షల నుంచి 22 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని అంచనా. ఈ వీకెండ్ కే లాంచ్ కాబోతున్న ఈ అదిరిపోయే ఎస్‌యూవీ కోసం కియా లవర్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News