Mahindra Scorpio N : సూపర్-8లోనే అసలు గండం..టీమిండియాకు 34 ఏళ్ల నాటి ప్లాన్‌తో మనోళ్లకు చెమటలు తప్పవా ?

టీమిండియాకు 34 ఏళ్ల నాటి ప్లాన్‌తో మనోళ్లకు చెమటలు తప్పవా ?

Update: 2026-02-20 12:04 GMT

Mahindra Scorpio N : మహీంద్రా తన పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియో ఎన్‎కు కొత్త హంగులు అద్దేందుకు సిద్ధమైంది. బిగ్ డాడీ ఆఫ్ ఎస్‌యూవీగా పేరు తెచ్చుకున్న ఈ వాహనం, 2026లో సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో మన ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ కారు రోడ్లపై టెస్టింగ్ దశలో ఉంది. ఇటీవల లీకైన సమాచారం ప్రకారం, కొత్త స్కార్పియో ఎన్‌లో రాబోతున్న మార్పులు, అదిరిపోయే ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.

2026 స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ తన పాత మజిల్ లుక్‌ను కొనసాగిస్తూనే, కొన్ని మోడ్రన్ టచ్‌లను సంతరించుకోనుంది. కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్, సరికొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్స్ రాబోతున్నాయి. కొత్త డిజైన్ కలిగిన 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీకి మరింత గంభీరమైన రూపాన్ని ఇస్తాయి. టెయిల్ ల్యాంప్స్‌లో చిన్నపాటి మార్పులు, కొత్త బంపర్ ఉండవచ్చు.

నిజమైన మార్పులన్నీ కారు లోపలే ఉండబోతున్నాయి. థార్ రాక్స్ నుంచి స్ఫూర్తి పొంది మరిన్ని లగ్జరీ ఫీచర్లను మహీంద్రా జోడిస్తోంది. ఇప్పటివరకు ఉన్న సింగిల్ పెన్ సన్‌రూఫ్ స్థానంలో భారీ పనోరమిక్ సన్‌రూఫ్ రానుంది. 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండబోతున్నాయి. ఈసారి ADAS లెవల్-2 (Advanced Driver Assistance Systems) టెక్నాలజీతో పాటు 360-డిగ్రీ కెమెరా కూడా వచ్చే అవకాశం ఉంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్స్ వంటివి అదనపు ఆకర్షణలు.

మెకానికల్ పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న శక్తివంతమైన ఇంజిన్లనే మహీంద్రా కొనసాగించనుంది.

ఒకటి 2.0L టర్బో పెట్రోల్. ఇది 200 bhp పవర్, 380 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండోది 2.2L టర్బో డీజిల్. ఇది 175 bhp పవర్, 400 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లు ఉంటాయి. 4WD (ఫోర్ వీల్ డ్రైవ్) ఆప్షన్ కూడా యథావిధిగా అందుబాటులో ఉంటుంది.

కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ 2026 మధ్యలో (మే లేదా ఆగస్టు నాటికి) మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అదనపు ఫీచర్ల కారణంగా దీని ధర ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.14 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News