Skoda Kodiaq : కారులో కూర్చుంటే రాజభోగమే.. స్కోడా కొత్త కోడియాక్ ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

స్కోడా కొత్త కోడియాక్ ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Update: 2026-05-12 14:56 GMT

Skoda Kodiaq : భారతీయ మార్కెట్లో లగ్జరీ ఎస్‌యూవీల హవా నడుస్తోంది. తాజాగా చెక్ రిపబ్లిక్ కార్ల దిగ్గజం స్కోడా తన మోస్ట్ పాపులర్ మోడల్ కొడియాక్ ను సరికొత్త అవతారంలో లాంచ్ చేసింది. 2026 స్కోడా కొడియాక్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు కేవలం అందంగా ఉండటమే కాదు, టెక్నాలజీ పరంగా కూడా మునుపటి కంటే చాలా పవర్‌ఫుల్‌గా మారింది. ముఖ్యంగా సేఫ్టీ విషయంలో రాజీ పడకుండా ఈసారి ADAS టెక్నాలజీని కూడా జోడించింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.36.99 లక్షలుగా ఉంది.

స్కోడా ఈ కొత్త కొడియాక్‌ను లాంజ్, స్పోర్ట్‌లైన్, సెలక్షన్ L&K అనే మూడు వేరియంట్లలో విడుదల చేసింది. లాంజ్ వేరియంట్ బేస్ మోడల్ కాగా, దీని ధర రూ.36.99 లక్షలు. ఇక స్పోర్టీ లుక్ ఇష్టపడే వారి కోసం స్పోర్ట్‌లైన్ వెర్షన్ రూ.44.99 లక్షలకు, అన్ని హంగులు ఉన్న టాప్ ఎండ్ వెర్షన్ సెలక్షన్ L&K రూ.46.99 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టాప్ వేరియంట్లలో ఇచ్చే ఫీచర్లు వింటే మీరు కారును కాకుండా ఒక చిన్నపాటి రాజప్రసాదాన్ని కొంటున్నారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది.

కొడియాక్ లోపలికి అడుగు పెడితే లగ్జరీ అంటే ఏంటో అర్థమవుతుంది. టాప్ మోడల్ సెలక్షన్ L&Kలో కాగ్నాక్ లేదర్ సీట్లతో పాటు ఫ్రంట్ సీట్లకు మసాజ్ ఫంక్షన్ ఇచ్చారు. అంటే లాంగ్ డ్రైవ్‌లో అలసిపోకుండా సీట్లే మీకు మసాజ్ చేస్తాయన్నమాట. వీటితో పాటు వెంట్లేషన్, హీటింగ్, పవర్ అడ్జస్ట్‌మెంట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ క్లస్టర్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆకాశం మొత్తం కనిపించేలా పనోరమిక్ సన్ రూఫ్ ఈ కారు సొంతం. కారు సాఫ్ట్‌వేర్‌ను కూడా అప్‌డేట్ చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మునుపటి కంటే చాలా వేగంగా ఉంటుంది.

ఈసారి స్కోడా కొడియాక్‌లో ప్రవేశపెట్టిన అతిపెద్ద మార్పు ADAS ప్యాకేజీ. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి ఫీచర్లు కారు నడిపేటప్పుడు ప్రమాదాలు జరగకుండా ముందే హెచ్చరిస్తాయి. రాత్రి వేళ డ్రైవింగ్‌ను సులభతరం చేసేందుకు ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్స్, కారు చుట్టూ ఏముందో చూపించే 360-డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి. ఇంటెలిజెంట్ పార్క్ అసిస్ట్ ఫీచర్ వల్ల ఇరుకైన సందుల్లో కూడా కారును పార్కింగ్ చేయడం చిటికెలో పని.

కారు గుండెకాయ లాంటి ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 2.0-లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను వాడారు. ఇది ఏకంగా 204 హార్స్‌పవర్ సామర్థ్యాన్ని, 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తోడవ్వడంతో రోడ్డుపై ఈ కారు ఒక రాకెట్లా దూసుకుపోతుంది. సిటీ ట్రాఫిక్ లో అయినా, హైవే పై అయినా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కోడియాక్ ఇస్తుంది. లగ్జరీ, పవర్, సేఫ్టీ కోరుకునే ఫ్యామిలీలకు ఇది ఒక పర్ఫెక్ట్ ఎస్‌యూవీ.

Tags:    

Similar News