Tata Motors : రూ. 4.69 లక్షలకే సరికొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. లగ్జరీ ఫీచర్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా

లగ్జరీ ఫీచర్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా

Update: 2026-05-28 12:38 GMT

Tata Motors : భారతదేశంలో బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో సరికొత్త సంచలనానికి తెరలేచింది. ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్, తమ ఎంట్రీ లెవెల్ మోడల్ టియాగోను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తెచ్చింది. పదేళ్లకు పైగా ఇండియన్ రోడ్లపై నమ్మకమైన వాహనంగా పేరు తెచ్చుకున్న ఈ కారును, భారీ మార్పులతో 2026 టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ రూపంలో అధికారికంగా లాంచ్ చేశారు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను కేవలం రూ.4.69 లక్షలుగా నిర్ణయించారు.

ఈ బడ్జెట్ ధరతో మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి సెలెరియో (రూ. 4.70 లక్షలు), హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ (రూ. 5.55 లక్షలు) వంటి కార్లకు టియాగో గట్టి పోటీ ఇవ్వనుంది. సరికొత్త డిజైన్, లగ్జరీ ఇంటీరియర్, నెక్ట్స్ లెవెల్ భద్రతా ప్రమాణాలతో వచ్చిన ఈ కొత్త కారు 6 వేరియంట్లలో (స్మార్ట్, ప్యూర్, ప్యూర్ ప్లస్, ప్యూర్ ప్లస్ ఎ, క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్) కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది.

కొత్త 2026 టాటా టియాగో ఇంజన్ పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇందులో మునుపటి లాగే నమ్మకమైన 1.2-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌ను అందించారు. ఇది పెట్రోల్ మోడ్‌లో 86hp పవర్‌ను, సీఎన్‌జీ మోడ్‌లో 75.5hp పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఈ రెండు వెర్షన్లలోనూ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కలవు. అయితే ఈ సెగ్మెంట్లోనే మొదటిసారిగా టాటా కంపెనీ సీఎన్‌జీ ఆటోమేటిక్ వేరియంట్లలో పాడిల్ షిఫ్టర్స్ ఫీచర్‌ను జోడించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక సీఎన్‌జీ ప్రియుల కోసం ఈ కారు బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే మారుతి సెలెరియో సీఎన్‌జీ కేవలం ఒక్క వేరియంట్లోనే లభిస్తుండగా, టాటా టియాగో దాదాపు అన్ని ప్రధాన వేరియంట్లలోనూ సీఎన్‌జీ ఆప్షన్‌ను తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. డిజైన్ పరంగా 2026 టియాగో మునుపటి కంటే చాలా అగ్రెసివ్‌గా, బోల్డ్‌గా కనిపిస్తోంది. కారు ముందు భాగంలో షార్ప్ హెడ్‌ల్యాంప్స్, సరికొత్త స్టైలిష్ గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్‌తో కూడిన రీడిజైన్డ్ బంపర్‌ను ఇచ్చారు. దీనివల్ల కారుకు ఎస్‌యూవీ లాంటి గంభీరమైన ఫ్రంట్ లుక్ వచ్చింది. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ ఏకంగా 170mm గా ఉంది.

సైడ్ ప్రొఫైల్‌లో సరికొత్త డిజైన్ గల 15-ఇంచుల అలాయ్ వీల్స్, వీల్ ఆర్చెస్ చుట్టూ బ్లాక్ క్లాడింగ్ అమర్చారు. ఇక వెనుక వైపు లగ్జరీ కార్ల తరహాలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ సెటప్, స్పోర్టీ రూఫ్ స్పాయిలర్‌ను జత చేశారు. ఈ కారు మొత్తం 6 ఆకర్షణీయమైన రంగుల్లో (డేటోనా గ్రే, పాంగోంగ్ పల్స్, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే, సోబో సర్జ్, వారణాసి వైబ్రెన్స్) లభించనుంది. కారు లోపలి భాగంలో డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను టాటా పూర్తిగా మార్చేసింది. పాత మోడల్ డిజైన్‌ను పక్కనబెట్టి, మరింత మోడ్రన్‌గా ఉండే ఫ్లాట్ డ్యాష్‌బోర్డ్‌ను పరిచయం చేసింది. కారులో సరికొత్త 2-స్పోక్ స్టీరింగ్ వీల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఏఎంటీ (AMT) వేరియంట్లలో లగ్జరీ కార్లలో ఉండేలా రోటరీ గేర్ సెలెక్టర్ డయల్‌ను అమర్చారు.

కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో వస్తున్న ఈ కారులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేసే 10.25-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్లు, రియర్ ఏసీ వెంట్స్, 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. సేఫ్టీకి పెద్దపీట వేసే టాటా మోటార్స్, ఈ చిన్న కారు బాడీషెల్‌ను మునుపటి కంటే మరింత పటిష్టంగా తయారు చేసింది. సేఫ్టీని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్తూ ఇందులో బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించారు. వీటితో పాటు కారును సులభంగా పార్కింగ్ చేయడానికి 360-డిగ్రీ కెమెరా సెటప్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రేర్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ (ISOFIX) చైల్డ్ సీట్ యాంకర్లు, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి తిరుగులేని సేఫ్టీ ఫీచర్లను జోడించారు. తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ ఫీచర్లు, గరిష్ట భద్రత కోరుకునే చిన్న కుటుంబాలకు ఈ కొత్త టియాగో ఒక పర్‌ఫెక్ట్ ఛాయిస్.

Tags:    

Similar News