Triumph Motorcycles : సరికొత్త అప్‌డేట్లతో మార్కెట్లోకి 2026 ట్రయంఫ్ బోన్‌విల్లే సిరీస్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే

ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే

Update: 2026-05-27 11:25 GMT

Triumph Motorcycles : ప్రపంచవ్యాప్తంగా క్లాసిక్, ప్రీమియం మోటార్‌సైకిళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బ్రిటిష్ బైక్ తయారీ సంస్థ ట్రయంఫ్, భారతీయ బైక్ లవర్స్ కోసం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తన మోస్ట్ పాపులర్ అండ్ ఐకానిక్ బోన్‌విల్లే సిరీస్‌లో సరికొత్త 2026 మోడళ్లను దేశీయ మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో భాగంగా Bonneville T120, Bonneville Bobber, Bonneville Speedmaster బైకులను సరికొత్త హంగులతో మార్కెట్లోకి దించింది. పాతకాలపు వింటేజ్ లుక్‌ను అలాగే కాపాడుకుంటూనే, నేటి తరం రైడర్లకు నచ్చేలా అల్ట్రా మోడ్రన్ సేఫ్టీ టెక్నాలజీ ఫీచర్లను ఇందులో జోడించారు.

ధరల విషయానికి వస్తే.. సరికొత్త అప్‌డేట్లతో వచ్చిన నయా బోన్‌విల్లే T120 బేస్ వేరియంట్ ప్రారంభ ధరను రూ.12.17 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. అలాగే మరింత అగ్రెసివ్ లుక్‌తో ఉండే బాబర్, స్పీడ్‌మాస్టర్ మోడళ్ల ప్రారంభ ధరను రూ.13.51 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ ప్రకటించింది. లాంగ్ రైడ్స్ వెళ్లాలనుకునే వారికి, రాయల్ లుక్‌తో రోడ్లపై రారాజులా తిరగాలనుకునే బైక్ ప్రేమికులకు ఈ సరికొత్త 2026 సిరీస్ ఒక పర్ఫెక్ట్ విజువల్ ట్రీట్ అని చెప్పవచ్చు.

ట్రయంఫ్ బోన్‌విల్లే T120:

ఈ సిరీస్‌లో క్లాసిక్ మోడల్‌గా పేరుగాంచిన బోన్‌విల్లే T120 బైక్ డిజైన్‌లో కంపెనీ చిన్నపాటి మార్పులు చేసింది. ఇప్పుడు ఈ బైక్ మరింత ప్రీమియంగా కనిపించడం కోసం సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్, స్టైలిష్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్ ను అమర్చారు. మునుపటి మోడల్ కంటే ఈ సరికొత్త వేరియంట్ ధర దాదాపు రూ.32,000 వరకు పెరిగింది. దీని బేస్ స్టోన్ గ్రే కలర్ వేరియంట్ రూ.12.17 లక్షలకు లభిస్తుండగా.. ఎవరైనా డ్యూయల్-టోన్ క్రానబెర్రీ రెడ్ లేదా ఈజియన్ బ్లూ కలర్స్ కావాలనుకుంటే అదనంగా మరో రూ.50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఫీచర్ల పరంగా ఇందులో రైడర్ల ప్రాణాలు కాపాడే అడ్వాన్స్‌డ్ ఐఎంయూ బేస్డ్ కార్నరింగ్ ఏబీఎస్, అత్యాధునిక ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను స్టాండర్డ్‌గా ఇచ్చారు. లాంగ్ జర్నీలలో ఎక్స్‌లరేటర్ తిప్పే పనిలేకుండా క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్, మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ , వింటేజ్ ఫీల్ ఇచ్చే సెమీ-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇందులో జోడించారు. ఈ బైక్‌లో పవర్‌ఫుల్ 1200cc లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజన్‌ను వాడారు. ఇది 78.9 bhp పవర్, 105 Nm టార్క్‌ను జనరేట్ చేస్తూ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో దూసుకుపోతుంది.

బాబర్, స్పీడ్‌మాస్టర్:

ఈసారి T120 కన్నా బోన్‌విల్లే బాబర్,స్పీడ్‌మాస్టర్ మోడళ్లలోనే ట్రయంఫ్ సంస్థ అతిపెద్ద మార్పులు చేసింది. లాంగ్ రైడ్స్ వెళ్లేటప్పుడు పదే పదే పెట్రోల్ బంకులకు వెళ్లే తిప్పలు లేకుండా.. ఈ రెండు బైకులలో పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీని మునుపటి 12 లీటర్ల నుంచి ఏకంగా 14 లీటర్లకు పెంచారు. అంతేకాదు, బాబర్ మోడల్‌లో రైడర్ కోసం మునుపటి కంటే చాలా వెడల్పైన, మెత్తటి కంఫర్టబుల్ సీటును డిజైన్ చేశారు.

ఇక క్రూయిజర్ బైక్ అయిన స్పీడ్‌మాస్టర్‌లో రైడర్‌తో పాటు వెనుక కూర్చునే పిలియన్ రైడర్ కోసం కూడా సోఫా లాంటి పెద్ద సీట్లను అందించారు. సుదూర ప్రయాణాలలో చేతులు నొప్పులు పుట్టకుండా ఉండేందుకు వీలుగా సరికొత్త స్ట్రెయిట్ హ్యాండిల్‌బార్‌ను దీనికి అమర్చారు. ఈ రెండు బైకులలో కూడా క్రూయిజ్ కంట్రోల్, ఐఎంయూ టెక్నాలజీ వంటి ప్రీమియం సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కొత్త అప్‌డేట్ల వల్ల ఈ రెండు మోడళ్ల ధరలు మునుపటి కంటే రూ.65,000 వరకు పెరిగి రూ. 13.51 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్నాయి. వీటిలో కూడా 1200cc ఇంజన్ ఉన్నప్పటికీ, దీని ట్యూనింగ్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇవి 77 bhp పవర్, 106 Nm టార్క్‌ను అందిస్తాయి.

Tags:    

Similar News