Yezdi Scrambler : యెజ్డీ స్క్రాంబ్లర్ 2026 లాంచ్.. రూ.2 లక్షల లోపే పవర్‌ఫుల్ ఆఫ్‌రోడ్ బైక్
రూ.2 లక్షల లోపే పవర్‌ఫుల్ ఆఫ్‌రోడ్ బైక్
Yezdi Scrambler : క్లాసిక్ బైక్‌ల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న యెజ్డీ మరోసారి భారత మార్కెట్‌ను ఊపేయడానికి సిద్ధమైంది. ఆఫ్‌రోడింగ్ లవర్లను, స్టైలిష్ రైడర్లను దృష్టిలో పెట్టుకుని సరికొత్త 2026 యెజ్డీ స్క్రాంబ్లర్‌ను కంపెనీ లాంచ్ చేసింది. పాత తరం క్లాసిక్ లుక్‌ను, ఆధునిక టెక్నాలజీని మేళవించి రూపొందించిన ఈ బైక్.. తక్కువ ధరలోనే అడ్వెంచర్ రైడింగ్ అనుభూతిని అందించబోతోంది.
కొత్త యెజ్డీ స్క్రాంబ్లర్ చూడటానికి చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ మీద 69 అనే నంబర్ ఉంటుంది, ఇది కంపెనీ గొప్ప వారసత్వాన్ని గుర్తు చేస్తుంది. క్లాసిక్ రెట్రో స్టైల్‌తో పాటు మోడ్రన్ టచ్ ఇచ్చేలా రౌండ్ హెడ్‌లైట్, ఫ్రంట్ బీక్, రిబ్బెడ్ సీటును ఇచ్చారు. దీని సెమీ-నాబీ టైర్లు అటు సిటీ రోడ్లకు, ఇటు మట్టి రోడ్లకు సరిగ్గా సరిపోతాయి. ఈ బైక్ బరువు 174 కిలోలు మాత్రమే ఉండటంతో హ్యాండ్లింగ్ చాలా సులభంగా ఉంటుంది.
ఈ బైక్‌లో 334cc లిక్విడ్-కూల్డ్, 4-వాల్వ్ DOHC KATAR ఇంజిన్‌ను అమర్చారు. ఇది 30 bhp పవర్, 30 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే దీని పవర్ రేషియో చాలా బలంగా ఉంది. లీటరుకు సుమారు 30 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. తన సెగ్మెంట్‌లో అత్యంత తేలికైన బైక్ కావడంతో వేగంగా దూసుకుపోవడానికి ఇది అనువుగా ఉంటుంది.
రైడర్ల సౌకర్యం కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. సీటు ఎత్తు 813 మిమీ ఉండటం వల్ల సాధారణ ఎత్తు ఉన్నవారు కూడా సులభంగా నడపవచ్చు. సేఫ్టీ కోసం ముందు 320 మిమీ డిస్క్, వెనుక 240 మిమీ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. 12.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం ఉండటం వల్ల లాంగ్ ట్రిప్స్ వేసే వారికి ఇది ఒక మంచి ఆప్షన్.
2026 యెజ్డీ స్క్రాంబ్లర్ ప్రారంభ ధర రూ.1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ ధరలో 300cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఆఫ్‌రోడ్ బైక్ దొరకడం కస్టమర్లకు గొప్ప విషయమే. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411,హోండా సీబీ 350 ఆర్ఎస్ వంటి బైక్‌లకు ఇది గట్టి పోటీని ఇవ్వనుంది. యెజ్డీ షోరూమ్‌లలో ఈ బైక్ అందుబాటులో ఉంది, మీరు ఇప్పుడే టెస్ట్ రైడ్ కోసం సంప్రదించవచ్చు.