Electric Cars : భారత్‌లో అత్యంత చౌకైన 3 ఎలక్ట్రిక్ కార్లు.. రూ.7 లక్షల నుంచే ధరలు షురూ
రూ.7 లక్షల నుంచే ధరలు షురూ
Electric Cars : దేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్లు అంటే కేవలం ధనవంతులకే పరిమితం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ప్రముఖ కార్ల తయారీ సంస్థలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతుండటం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరం రావడంతో ప్రజలు ఈవీల వైపు అడుగులు వేస్తున్నారు.
1. ఎంజీ కామెట్ ఈవీ
భారతదేశంలో దొరికే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా ఎంజీ కామెట్ ఈవీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 7 లక్షలుగా ఉంది. కస్టమర్ల సౌకర్యార్థం కంపెనీ ఇందులో బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ఆప్షన్‌ను కూడా ఇస్తోంది, దీనివల్ల కారును ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ కారు సైజ్ చాలా చిన్నదిగా ఉండటం వల్ల సిటీలోని భారీ ట్రాఫిక్ రోడ్లపై సులభంగా నడపవచ్చు. చిన్న పార్కింగ్ స్థలంలో కూడా ఈజీగా ఫిట్ చేయవచ్చు. లాంగ్ డ్రైవ్స్ లేదా హైవేలకు అంతగా సూట్ అవ్వకపోయినా, రోజువారీ సిటీ లోకల్ ప్రయాణాలకు, ఆఫీస్ కమ్యూట్ కు ఇది ఒక అదిరిపోయే ఆప్షన్.
2. టాటా టియాగో ఈవీ
టాటా మోటార్స్ నుంచి లభిస్తున్న అత్యంత చౌకైన, నమ్మకమైన ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీ. ఈ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ ఈవీ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.99 లక్షలుగా నిర్ణయించారు. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లు, నమ్మకమైన బ్రాండ్ వాల్యూ కోరుకునే వారికి ఇది మొదటి చాయిస్ గా నిలుస్తోంది. దీని కాంపాక్ట్ డిజైన్ కారణంగా సిటీ రోడ్లపై హ్యాండ్లింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే, ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 315 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది, ఇది మీ రోజువారీ అవసరాలకు ఎంతో ఎక్కువ.
3. టాటా పంచ్ ఈవీ
ఎస్‌యూవీ లుక్ ఇష్టపడే వారి కోసం టాటా పంచ్ ఈవీ మార్కెట్లో దుమ్ము రేపుతోంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షలుగా ఉంది, అంటే దీని బేస్ మోడల్ రూ.10 లక్షల లోపు బడ్జెట్ లోనే లభిస్తుంది. గత కొన్ని నెలలుగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో పంచ్ ఈవీ టాప్ లో ఉంది. కంపెనీ దీనిని 25 kWh, 35 kWh అనే రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లతో విక్రయిస్తోంది. ఇందులో 25 kWh బ్యాటరీ వెర్షన్ ఒకసారి ఛార్జ్ చేస్తే 265 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, 35 kWh బ్యాటరీ వెర్షన్ ఏకంగా 365 కిలోమీటర్ల మైలేజ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.
మీ బడ్జెట్ గనుక ఖచ్చితంగా రూ.10 లక్షల లోపు ఉండి, రోజువారీ ఇంధన ఖర్చులను ఆదా చేసుకోవాలనుకుంటే పైన పేర్కొన్న మూడు కార్లు కూడా అద్భుతమైన ఆప్షన్లు. కేవలం సిటీ లోపల తక్కువ ధరలో చిన్న కారు కావాలనుకుంటే ఎంజీ కామెట్ ఈవీని ఎంచుకోవచ్చు. మంచి ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్ కారుతో పాటు ఎక్కువ మైలేజ్ రేంజ్ కావాలనుకుంటే టాటా టియాగో ఈవీ బెస్ట్. అలా కాకుండా, స్టైలిష్ ఎస్‌యూవీ లుక్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు,ఎక్కువ మైలేజ్ కావాలనుకుంటే టాటా పంచ్ ఈవీని ధైర్యంగా ఎంచుకోవచ్చు.