Electric Scooter : రూ.45 వేలకే అదిరిపోయే రేంజ్ ఇచ్చే స్మార్ట్ స్కూటర్లు .. ఫుల్ డీటెయిల్స్ ఇవే
ఫుల్ డీటెయిల్స్ ఇవే
Electric Scooter : పెట్రోల్ ధరలు సెంచరీ దాటి ఎప్పుడో దూసుకుపోతున్నాయి. అందుకే మధ్యతరగతి జనం ఇప్పుడు పెట్రోల్ బండ్లకు గుడ్ బై చెప్పేసి, ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ అంటే లక్షల్లో ఉంటుంది కదా బాబూ.. అనుకునే వారికి ఒక గుడ్ న్యూస్. ఇప్పుడు కేవలం రూ.45 వేలకే అదిరిపోయే రేంజ్ ఇచ్చే స్మార్ట్ స్కూటర్లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. తక్కువ ధరలో మంచి రేంజ్, తక్కువ మెయింటెనెన్స్‌తో నగరాల్లో తిరగడానికి బెస్ట్ ఆప్షన్లు ఇవే.
1. హీరో విడా VX2
బడ్జెట్ ధరలో దొరికే స్కూటర్లలో హీరో విడా VX2 టాప్ లిస్టులో ఉంది. దీని అసలు ధర లక్షల్లో ఉన్నా, కంపెనీ అందిస్తున్న BaaS (Battery-as-a-Service) ప్లాన్ ద్వారా మీరు దీనిని కేవలం రూ.44,990 (ఎక్స్-షోరూమ్)కే సొంతం చేసుకోవచ్చు. బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవడం వల్ల ముందస్తు ధర తగ్గుతుంది. దీనిలో బ్యాటరీని తీసి ఇంట్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
2. టీవీఎస్ ఐక్యూబ్
క్వాలిటీకి మారుపేరుగా నిలిచే టీవీఎస్ ఐక్యూబ్ కూడా ఇప్పుడు చౌకగా లభిస్తోంది. దీనిలో కొత్తగా ప్రవేశపెట్టిన బ్యాటరీ ప్లాన్ల ద్వారా బేస్ వేరియంట్ ధర సుమారు రూ.60,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 100 నుంచి 212 కిమీ వరకు రేంజ్ ఇచ్చే వేరియంట్లు ఉన్నాయి. సర్వీస్ నెట్‌వర్క్ బాగుండటం, రైడింగ్ కంఫర్ట్‌గా ఉండటం వల్ల ఫ్యామిలీస్ దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.
3. ఏథర్ రిజ్తా
మరీ చీప్ కాకుండా, కాస్త ప్రీమియం లుక్, ఫ్యామిలీ అవసరాలు తీరాలంటే ఏథర్ రిజ్తా మంచి ఎంపిక. దీని ధర సుమారు రూ.76,000 (BaaS ప్లాన్ తో) నుంచి మొదలవుతుంది. దీనిలో పెద్ద సీటు, ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ఉంటాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, ఫాస్ట్ ఛార్జింగ్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు దీని ప్రత్యేకత.
4. బజాజ్ చేతక్, ఓలా
ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో ఓలా ఎస్1 ఎక్స్, బజాజ్ చేతక్ కూడా బడ్జెట్ యూజర్లను టార్గెట్ చేశాయి. ఓలాలో కొన్ని ఎంట్రీ లెవల్ మోడల్స్ రూ.70 వేల కంటే తక్కువ ధరకే లభిస్తున్నాయి. బజాజ్ చేతక్ తన మెటల్ బాడీ, పాత స్టైలిష్ లుక్ తో నమ్మకమైన స్కూటర్‌గా నిలుస్తోంది.