CNG Vehicles : ఆటో మార్కెట్లో సీఎన్టీ హవా.. సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రాబోతున్న ఈ 3 SUVలివే !
సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రాబోతున్న ఈ 3 SUVలివే !;
CNG Vehicles : భారతదేశ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా CNG వాహనాలకు డిమాండ్ బాగా పెరిగింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, అలాగే పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన కారణంగా చాలా మంది ప్రజలు CNGని ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ గా ఎంచుకుంటున్నారు. అందుకే దేశంలోని దాదాపు అన్ని పెద్ద కార్ల తయారీ కంపెనీలు తమ ప్రస్తుత, కొత్త మోడళ్లలో CNG వేరియంట్లను చేర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా CNG వాహనాల అమ్మకాలు డీజిల్ వాహనాల అమ్మకాలను అధిగమించాయి. ఇది సీఎన్జీ మార్కెట్ ఎంత బలంగా ఉందో చూపిస్తుంది.
రాబోయే 3 CNG SUVలు
CNG కార్లకు ఇంత పాపులారిటీ రావడానికి ప్రధాన కారణం వాటి తక్కువ ఇంధన ఖర్చు, మంచి మైలేజీ. ఈ లక్షణాల వల్ల రాబోయే రోజుల్లో CNGతో నడిచే మరిన్ని వాహనాలు భారత మార్కెట్లో ఎంట్రీ ఇస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా 3 SUVలు బాగా చర్చలో ఉన్నాయి.
1. స్కోడా కైలాక్ CNG
యూరోపియన్ బ్రాండ్ స్కోడాకు చెందిన కైలాక్ భారతదేశంలో అత్యంత పాపులారిటీ పొందిన SUVలలో ఒకటిగా ఉంది. దీని నెలవారీ అమ్మకాలు దాదాపు 5000 యూనిట్లకు చేరుకున్నాయి. ఇటీవల, స్కోడా ఇండియా కైలాక్ CNG వేరియంట్‌ను తీసుకురావడానికి సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు ప్రకటించింది. ఇది వెంటనే లాంచ్ కాకపోయినా, ప్రస్తుతం ఉన్న టర్బో-పెట్రోల్ ఇంజిన్ CNGతో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి టెక్నికల్ ఇవాల్యుషన్ ఇప్పటికే మొదలైంది.
2. టాటా కర్వ్ CNG
టాటా మోటార్స్ వారి SUV 'కర్వ్' ను ఇటీవల పుణెలో CNG సెటప్‌తో టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఇది భారతదేశంలో పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ – ఈ నాలుగు ఆప్షన్లలో అందుబాటులోకి రాబోయే మొదటి SUV కానుంది. ఇందులో టాటా ట్విన్-సిలిండర్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇది ఇప్పటికే టియాగో, ఆల్ట్రోజ్ వంటి మోడళ్లలో ఉంది. కర్వ్ CNG నేరుగా మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజర్ హై రైడర్‌కు గట్టి పోటీనిస్తుంది.
3. కియా కారెన్స్ CNG
కియా కంపెనీ 2025 చివరి నాటికి కారెన్స్ CNG వెర్షన్‌ను 'కారెన్స్ క్లేవిస్' పేరుతో విడుదల చేయబోతోంది. మారుతి ఎర్టిగాకు పోటీగా ఈ కారును తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది, ధర విషయంలో కూడా పోటీ ఉంటుందని అంచనా. కారెన్స్ CNG, పెద్ద ఫ్యామిలీలకు, MPVలను ఇష్టపడే వినియోగదారులకు ఒక స్మార్ట్ , లో బడ్జెట్ తో కూడుకున్న ఆప్షన్ అని చెప్పొచ్చు.