Aprilia Tuono 457 : యువతను ఊపేసే సరికొత్త బైక్.. మార్కెట్లోకి అప్రిలియా టువోనో 457 స్పెషల్ ఎడిషన్

మార్కెట్లోకి అప్రిలియా టువోనో 457 స్పెషల్ ఎడిషన్

Update: 2026-06-22 12:55 GMT

Aprilia Tuono 457 : స్పోర్ట్స్, లగ్జరీ బైక్స్ తయారీలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ బ్రాండ్ అప్రిలియా.. భారతీయ బైక్ ప్రేమికుల కోసం ఒక సరికొత్త స్పెషల్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. తమ పాపులర్ మోడల్ అయిన టువోనో 457 సిరీస్‌లో అప్రిలియా టువోనో 457 స్పెషల్ ఎడిషన్‎ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.3.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త బైక్‌ను రైడర్ల కంఫర్ట్ , ఈజీ హ్యాండ్లింగ్, ప్రీమియం డిజైన్‌కు ప్రాధాన్యత ఇస్తూ సరికొత్తగా అప్‌గ్రేడ్ చేశారు.

బుకింగ్స్ షురూ.. క్లాసిక్ లుక్‌తో ఎంట్రీ

ఈ సరికొత్త అప్రిలియా టువోనో 457 స్పెషల్ ఎడిషన్ బైక్ ప్రీ-బుకింగ్స్ దేశవ్యాప్తంగా ఉన్న ఎంపిక చేసిన కంపెనీ షోరూమ్‌లలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. లుక్ పరంగా ఈ బైక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి కంపెనీ ఇందులో రెండు సరికొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. అవే మాంబా బ్లాక్, పూమా గ్రే. ఈ రెండు కలర్స్ 2006 నాటి ఐకానిక్ మోడల్ టువోనో 1000ఆర్ బైక్ నుంచి ప్రేరణ పొంది డిజైన్ చేసినవి కావడం విశేషం. కొత్త గ్రాఫిక్స్, అప్‌డేటెడ్ బ్రాండింగ్ వల్ల బైక్ రోడ్డుపై వెళ్తుంటే అందరి కళ్లూ దీనిపైనే పడేలా ఉంది.

లాంగ్ రైడ్స్ చేసే వారికి సూపర్ కంఫర్ట్

ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌లో రైడర్‌కు అలసట లేకుండా ఉండేందుకు కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇందులో ముందు వైపు హెడ్‌లైట్‌కు సరిగ్గా సరిపోయేలా కొత్త స్మోక్డ్ ఫ్లైస్క్రీన్‎ను అమర్చారు. ఇది హై-స్పీడ్‌లో వెళ్లేటప్పుడు గాలి ఒత్తిడిని తగ్గించి రైడర్ అలసిపోకుండా చూస్తుంది. అలాగే పాత మోడల్ కంటే హ్యాండిల్‌బార్ ఎత్తును కాస్త పెంచారు. దీనివల్ల రైడర్ వంగాల్సిన అవసరం లేకుండా స్ట్రెయిట్‌గా కూర్చోవచ్చు. ఫలితంగా మణికట్టు, భుజాలపై ఎలాంటి నొప్పులు రావు. సిటీ ట్రాఫిక్‌లో కూడా బైక్‌ను చాలా ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. దీనితో పాటు మెరుగైన సీటు, అడ్జస్టబుల్ బ్రేక్ లివర్లు, కొత్త సస్పెన్షన్ జామెట్రీని అందించారు.

భారతీయ రోడ్లకు తగ్గట్టుగా స్మార్ట్ సస్పెన్షన్

భారతదేశంలోని ఉబ్బెత్తు రోడ్లు, స్పీడ్ బ్రేకర్లు, గుంతలను తట్టుకునేలా అప్రిలియా ఈ బైక్ సస్పెన్షన్ సిస్టమ్‌ను రీ-ట్యూన్ చేసింది. బైక్ సస్పెన్షన్ ప్రారంభ మూవ్‌మెంట్‌ను సాఫ్ట్‌గా మార్చారు. దీనివల్ల రోడ్డుపై ఎలాంటి గుంతలు ఎదురైనా రైడర్‌కు ఆ షాక్ తగలకుండా స్మూత్ రైడింగ్ అనుభూతి కలుగుతుంది. అదనంగా, ముందు, వెనుక సస్పెన్షన్‌లలో ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్ సౌకర్యం ఉంది. అంటే రైడర్ తన బరువు, రోడ్డు కండిషన్‌ను బట్టి సస్పెన్షన్ సెట్టింగ్‌ను తనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు.

పవర్‌ఫుల్ ఇంజిన్, మోడ్రన్ ఫీచర్లు

ఇంజిన్ పరంగా కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. పాత మోడల్‌లో ఉండే నమ్మకమైన 457cc పారలల్-ట్విన్ ఇంజిన్‌నే ఇందులోనూ కొనసాగించారు. ఈ ఇంజిన్ 47.6 bhp గరిష్ట పవర్‌ను, 43.5 Nm టాప్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. తేలికపాటి అల్యూమినియం ఛాసిస్‌తో రావడం వల్ల బైక్ పెర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. టెక్నాలజీ విషయానికి వస్తే.. ఇందులో రైడ్-బై-వైర్ థ్రాటిల్, మల్టీ-లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్, టీఎఫ్‌టీ డిజిటల్ డిస్‌ప్లే,సెల్ఫ్-డయాగ్నోసిస్ సిస్టమ్ ఉన్నాయి. కారు దొంగతనాలకు గురికాకుండా ఉండటానికి ఇమ్మొబిలైజర్ సేఫ్టీ సిస్టమ్‎ను స్టాండర్డ్‌గా ఇచ్చారు.

4 ఏళ్ల వారంటీ, అదనపు యాక్సెసరీస్

వినియోగదారుల నమ్మకం కోసం అప్రిలియా కంపెనీ ఈ బైక్‌పై 4 సంవత్సరాలు లేదా 48,000 కిలోమీటర్ల వరకు అద్భుతమైన వారంటీని అందిస్తోంది. ఇది కాకుండా, కస్టమర్లు తమకు నచ్చినట్లు బైక్‌ను మోడిఫై చేసుకోవడానికి క్విక్ షిఫ్టర్, టీపీఎమ్‌ఎస్ (టయర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), యూఎస్‌బీ ఛార్జింగ్ సాకెట్, హెల్మెట్ లాక్, ఫోర్క్ స్లైడర్లు, ఎలక్ట్రానిక్ యాంటీ-థెఫ్ట్ సిస్టమ్ వంటి యాక్సెసరీలను అదనంగా కొనుగోలు చేయవచ్చు. తక్కువ బడ్జెట్‌లో స్పోర్టీ లుక్, అదిరిపోయే పవర్, బెస్ట్ కంఫర్ట్ కోరుకునే బైక్ లవర్స్‌కు ఈ మిడ్-సైజ్ ట్విన్-సిలిండర్ బైక్ ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Tags:    

Similar News