Ather Rizta : ఈవీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. జూన్ 1 నుంచి పెరిగిన ఏథర్ రిజ్తా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు

జూన్ 1 నుంచి పెరిగిన ఏథర్ రిజ్తా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు

Update: 2026-06-06 07:05 GMT

Ather Rizta : భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ రంగంలో ఓలా స్కూటర్లకు గట్టి పోటీ ఇస్తూ, ఫ్యామిలీ ఈవీ సెగ్మెంట్‌లో దూసుకుపోతున్న ఏథర్ రిజ్తా స్కూటర్ ఇప్పుడు మరింత ప్రియమైంది. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ జూన్ 1, 2026 నుంచి అమలులోకి వచ్చేలా ఈ స్కూటర్ ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వేరియంట్, బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా కస్టమర్లపై రూ.3,000 నుంచి రూ.4,000 వరకు అదనపు భారం పడనుంది. దేశీయ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తున్న తరుణంలో ఈ ధరల పెంపు నిర్ణయం వెలువడింది.

బ్యాటరీ ఆప్షన్లు, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్

ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రధానంగా S, Z అనే రెండు వేరియంట్లలో మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ స్కూటర్‌లో అమర్చిన 4.3 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 22 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లుగా ఉంది. కస్టమర్ల అవసరాల కోసం కంపెనీ ఇందులో 2.9 kWh, 3.7 kWh సామర్థ్యం గల రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందిస్తోంది. ఇవి ఒకే ఛార్జ్‌పై ఐడీసీ సర్టిఫైడ్ ప్రకారం వరుసగా 123 కిలోమీటర్లు, 159 కిలోమీటర్ల లాంగ్ రేంజ్‌ను అందిస్తాయి.

రిజ్తా Sలో లభించే బేసిక్ ఫీచర్లు

ధరలు పెరిగినప్పటికీ ఈ స్కూటర్ అందించే అత్యాధునిక ఫీచర్లు రైడర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బేస్ మోడల్ అయిన రిజ్తా S వేరియంట్‌లో 7-ఇంచుల డీప్‌వ్యూ డిస్‌ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రీజెనరేటివ్ బ్రేకింగ్, సీబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ఫ్యామిలీస్ కోసం భారీగా 34 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ కెపాసిటీ, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, ఆటో హోల్డ్, గైడ్ మీ హోమ్ లైట్స్, వెహికల్ ఫాల్ సేఫ్ (స్కూటర్ కింద పడిపోతే అలర్ట్ అయ్యే సిస్టమ్), కాల్, మ్యూజిక్ కంట్రోల్స్ వంటి స్మార్ట్ ఫీచర్లను ఏథర్ కనెక్ట్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

టాప్ వేరియంట్ రిజ్తా Z హైటెక్ వండర్స్

ఇక హై-స్పెసిఫికేషన్లతో వచ్చే టాప్ మోడల్ రిజ్తా Z వేరియంట్‌లో ఫీచర్లు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఇందులో సాధారణ డిస్‌ప్లేకు బదులుగా 7-ఇంచుల టిఎఫ్‌టి (TFT) టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. దీనితో పాటు మ్యాజిక్ ట్విస్ట్, స్కిడ్ కంట్రోల్, ఆటో-బ్రెయిట్‌నెస్ అడ్జస్ట్‌మెంట్, ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్, రోడ్డుపై ఉన్న గుంతలను ముందుగానే హెచ్చరించే పోట్‌హోల్ అలర్ట్స్, ప్రమాదాల తీవ్రతను తెలిపే క్రాష్ అలర్ట్స్, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌పైనే లైవ్ క్రికెట్ స్కోర్ చూసే క్రికెట్ డాష్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, డాక్యుమెంట్ స్టోరేజ్, వాట్సాప్ ప్రివ్యూ, లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి అల్ట్రా మోడరన్ ఫీచర్లు కేవలం ఈ Z వేరియంట్‌లోనే లభిస్తాయి.

ధరలు పెరగడానికి అసలు కారణాలు

ప్రస్తుతం ఆటోమొబైల్ రంగాన్ని వేధిస్తున్న ముడిసరుకుల ఉత్పత్తి వ్యయం పెరగడం, అంతర్జాతీయంగా గ్లోబల్ సప్లై చైన్‎లో ఏర్పడిన తీవ్ర అడ్డంకులే ఈ హఠాత్ ధరల పెంపునకు ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ, ఏథర్ రిజ్టా తన అద్భుతమైన ప్రాక్టికల్ డిజైన్, ఫ్యామిలీ కంఫర్ట్ మరియు తిరుగులేని సేఫ్టీ టెక్నాలజీ కారణంగా భారతీయ ఇళ్లలో అత్యంత ఇష్టపడే ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకుంటోంది.

Tags:    

Similar News