Bajaj Pulsar : బైక్ కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్..పల్సర్ 25 ఏళ్ల పండగ సందర్భంగా రూ.7000 డిస్కౌంట్
పల్సర్ 25 ఏళ్ల పండగ సందర్భంగా రూ.7000 డిస్కౌంట్
Bajaj Pulsar : భారతీయ యువత పల్స్ తెలిసిన బైక్ బజాజ్ పల్సర్. దేశీయ రోడ్ల మీద స్పోర్ట్స్ బైక్ అంటే ఎలా ఉండాలో నేర్పిన ఈ బ్రాండ్, ఇప్పుడు ఒక అరుదైన మైలురాయిని అందుకుంది. భారత్‌లోకి పల్సర్ అడుగుపెట్టి విజయవంతంగా 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, బజాజ్ ఆటో తన కస్టమర్లకు అదిరిపోయే బహుమతిని ప్రకటించింది. పావు శతాబ్దపు ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ భారీ డిస్కౌంట్ ఆఫర్లను మార్కెట్లోకి వదిలింది.
పల్సర్ 25 ఏళ్ల యానివర్సరీ సందర్భంగా ఎంపిక చేసిన మోడల్స్‌పై రూ.7,000 వరకు నగదు తగ్గింపును బజాజ్ ప్రకటించింది. కేవలం ధర తగ్గించడమే కాకుండా, కొత్త బైక్ కొనేవారికి ఫైనాన్స్‌పై జీరో ప్రాసెసింగ్ ఫీజు, 5 ఉచిత సర్వీసులను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ ఇప్పటికే అన్ని షోరూమ్‌లలో అందుబాటులోకి వచ్చిందని, అయితే ఇది పరిమిత కాలం మాత్రమే ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. స్టాక్ ఉన్నంత వరకే ఈ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
ప్రస్తుతం పల్సర్ రేంజ్‌లో మొత్తం 11 రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో వచ్చే పల్సర్ 125 నుంచి మొదలుకొని పల్సర్ N150, N160, NS160, NS200 వంటి స్పోర్టీ మోడల్స్ యువతను ఆకట్టుకుంటున్నాయి. ఇక 250cc విభాగంలో పల్సర్ N250, F250 ఉన్నాయి. పల్సర్ ప్రయాణంలో మైలురాయిగా నిలిచిన NS400Z ఇప్పుడు ఈ లైనప్‌లో అత్యంత పవర్ఫుల్ మోడల్‌గా నిలుస్తోంది. డీటీఎస్-ఐ (DTS-i) వంటి అడ్వాన్సుడ్ టెక్నాలజీ సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిన ఘనత పల్సర్‌దే.
బజాజ్ మోటార్‌సైకిల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ సారంగ్ కనాడే మాట్లాడుతూ.. గత రెండున్నర దశాబ్దాలుగా భారత స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌ను పల్సర్ శాసిస్తోందని అన్నారు. స్పోర్టీ డిజైన్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి పల్సర్ మొదటి ఛాయిస్ అని పేర్కొన్నారు. ఇప్పుడు వచ్చిన ఈ యానివర్సరీ ఆఫర్ ద్వారా మరింత మంది కస్టమర్లు పల్సర్ ఫ్యామిలీలో చేరతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన బైక్స్‌ను తీసుకువస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.
ఈ డిస్కౌంట్ ప్రకటనతో బజాజ్ షోరూమ్‌ల వద్ద సందడి మొదలైంది. ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్లు, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత ఈ ఆఫర్‌ను అందిపుచ్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. రూ.7,000 ఆదా అవ్వడంతో పాటు జీరో ప్రాసెసింగ్ ఫీజు ఉండటం మధ్యతరగతి వారికి పెద్ద ఊరట.