Cruise Control Bikes : బడ్జెట్ బైక్‌లలోనూ క్రూయిజ్ కంట్రోల్.. లాంగ్ రైడ్ వెళ్లేవారికి ఈ 5 బైక్‌లు బెస్ట్ ఆప్షన్స్

లాంగ్ రైడ్ వెళ్లేవారికి ఈ 5 బైక్‌లు బెస్ట్ ఆప్షన్స్

Update: 2026-05-05 12:06 GMT

Cruise Control Bikes : సాధారణంగా బైక్‌పై లాంగ్ డ్రైవ్ వెళ్లేటప్పుడు గంటల తరబడి ఎక్సలరేటర్ పట్టుకుని ఉండటం వల్ల చేతులు నొప్పి పుడతాయి. ఈ ఇబ్బందిని తప్పించేందుకే కార్లలో ఉండే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ ఇప్పుడు బైక్‌లలో కూడా అందుబాటులోకి వచ్చింది. గతంలో ఇది కేవలం లక్షల రూపాయల ఖరీదైన హై-ఎండ్ బైక్‌లకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు మన మధ్యతరగతి బడ్జెట్ బైక్‌లలో కూడా ఈ ప్రీమియం ఫీచర్ వచ్చేసింది. ఈ ఫీచర్ ఉంటే, ఒక నిర్దిష్ట వేగాన్ని సెట్ చేసుకుంటే చాలు.. ఎక్సలరేటర్ ఇవ్వక్కర్లేకుండానే బైక్ అదే వేగంతో సాగిపోతుంది. మరి క్రూయిజ్ కంట్రోల్‌తో లభిస్తున్న 5 చౌకైన బైక్‌ల వివరాలు చూద్దాం.

1. హీరో గ్లామర్ ఎక్స్

క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఉన్న బైక్‌లలో భారతదేశంలోనే అత్యంత చౌకైన బైక్ ఇదే. దీని ప్రారంభ ధర సుమారు రూ. 86,567 (ఎక్స్-షోరూమ్). దీని డిస్క్ వేరియంట్ ధర రూ. 95,786 వరకు ఉంటుంది. సాధారణంగా రోజువారీ అవసరాలకు వాడే ఈ ఫ్యామిలీ బైక్‌లో క్రూయిజ్ కంట్రోల్ ఇవ్వడం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. సిటీలో తిరగడమే కాకుండా, అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్లేవారికి ఇది సరైన ఎంపిక.

2. హీరో ఎక్స్‌ట్రీమ్ 125R, 160R 4V

హీరో ఎక్స్‌ట్రీమ్ 125R మోడల్ యువతను బాగా ఆకట్టుకుంటోంది. దీని టాప్ వేరియంట్ ధర సుమారు రూ. 1.07 లక్షలు కాగా, ఇందులో క్రూయిజ్ కంట్రోల్ సౌకర్యం ఉంది. ఇకపోతే కొంచెం ఎక్కువ పవర్ కోరుకునే వారి కోసం ఎక్స్‌ట్రీమ్ 160R 4V సిద్ధంగా ఉంది. దీని ETB వేరియంట్ ధర రూ. 1.36 లక్షల వరకు ఉంటుంది. స్పోర్టీ లుక్ తో పాటు సుఖవంతమైన ప్రయాణం కావాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్స్.

3. టీవీఎస్ అపాచీ RTX 300

టీవీఎస్ అపాచీ శ్రేణిలో వచ్చిన మరో అద్భుతమైన బైక్ RTX 300. ఇందులో ప్రతి వేరియంట్‌లోనూ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఉండటం విశేషం. 299cc ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ పవర్ పరంగానూ అగ్రస్థానంలో ఉంటుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 1.99 లక్షలు. హైవేలపై వేగంగా వెళ్తూ కూడా రైడర్ అలసిపోకుండా ఉండటానికి ఇందులోని క్రూయిజ్ కంట్రోల్ బాగా ఉపయోగపడుతుంది.

4. టీవీఎస్ అపాచీ RTR 310

టీవీఎస్ నుండి వస్తున్న అత్యంత అడ్వాన్స్డ్ బైక్ RTR 310. దీని ప్రారంభ ధర రూ. 2.24 లక్షలు. ఇందులో 312cc ఇంజిన్‌తో పాటు, క్రూయిజ్ కంట్రోల్ వంటి మరెన్నో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా లాంగ్ టూరింగ్ చేసేవారికి, బైక్ నుంచి హై-ఎండ్ ఫీచర్లు ఆశించే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ బైక్ వేగంతో పాటుగా రైడర్‌కు అదిరిపోయే కంఫర్ట్ ఇస్తుంది.

Tags:    

Similar News