Electric SUVs : మారుతి ఈ విటారా నుంచి టాటా నెక్సాన్ వరకు..రూ.20 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు
రూ.20 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు
Electric SUVs : పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న తరుణంలో చాలామంది చూపు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా 2026 సంవత్సరం నాటికి భారత మార్కెట్లో బడ్జెట్ ధరలో లభించే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల హవా పెరగనుంది. మీరు కూడా 20 లక్షల లోపు బడ్జెట్‌లో మంచి ఫీచర్లు, మంచి రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తుంటే, మార్కెట్లో ఉన్న టాప్ 5 ఆప్షన్లు ఇవే.
1. మారుతి సుజుకి ఈ-విటారా
మారుతి సుజుకి నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇది. దీని ధర రూ.10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ మోడల్‌లో లభిస్తుంది. అంటే కారు కొని, బ్యాటరీకి కిలోమీటరుకు రూ.3.99 చొప్పున అద్దె చెల్లించవచ్చు. దులో 49 kWh, 61 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 543 కిమీ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
2. మహీంద్రా BE 6
మహీంద్రా తన కొత్త BE బ్రాండ్‌తో ఎలక్ట్రిక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. దీని లుక్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. ఇది కేవలం 6.7 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇందులో 59 kWh, 79 kWh బ్యాటరీలు ఉన్నాయి. పెద్ద బ్యాటరీతో ఏకంగా 638 కిమీ వరకు ప్రయాణించవచ్చు.
3. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటా ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో వచ్చింది. దీని ప్రారంభ ధర దాదాపు రూ.18.02 లక్షలు. ఇందులో 42 kWh, 51.4 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే ఇది 473 కిమీ వరకు రేంజ్ ఇస్తుంది. లోపల విలాసవంతమైన ఇంటీరియర్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు దీని సొంతం.
4. టాటా నెక్సాన్ ఈవీ
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు ఇది. ఇటీవల దీనిని 45 kWh బ్యాటరీతో అప్‌డేట్ చేశారు. దీని ప్రారంభ ధర రూ.12.49 లక్షలు. 2025 చివరి నాటికి ఒక లక్ష యూనిట్ల విక్రయాలు దాటిన తొలి ఈవీగా ఇది రికార్డు సృష్టించింది. ఇది గరిష్టంగా 489 కిమీ రేంజ్ ఇస్తుంది. కేవలం 8.9 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.
5. ఎంజీ విండ్సర్ ఈవీ
ఎంజీ మోటార్స్ దీనిని ఒక CUV(క్రాస్ ఓవర్) అని పిలుస్తుంది. దీని ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 135 డిగ్రీల వరకు వెనక్కి వాలే ఏరో లాంజ్ సీట్లు, పనోరమిక్ గ్లాస్ రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది 38 kWh, 52.9 kWh బ్యాటరీలతో వస్తుంది. గరిష్టంగా 449 కిమీ రేంజ్ ఇస్తుంది.