Petrol Ban : జూలై 1నుంచి ఈ వాహనాలకు బంకుల్లో పెట్రోల్, డీజిల్ బంద్

పెట్రోల్, డీజిల్ బంద్;

Update: 2025-06-21 06:50 GMT

Petrol Ban : ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వం కొత్త కొత్త ప్లాన్లు వేస్తోంది. అందులో భాగంగా ఈసారి పాత బండ్ల మీద కన్నేసింది. మీ బైక్ లేదా కారు పాతదైతే, జులై 1వ తేదీ నుంచి ఢిల్లీలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ దొరకకపోవచ్చు. కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి కొత్త రూల్ తీసుకొచ్చారు. ఆ రూల్ ప్రకారం, జులై 1 నుంచి, పదేళ్ల కంటే పాత డీజిల్ బండ్లు, అలాగే పదిహేను ఏళ్ల కంటే పాత పెట్రోల్ బండ్లకు పెట్రోల్ పంపుల్లో ఇంధనం ఇవ్వరు. ఈ బండ్లని ఎండ్-ఆఫ్-లైఫ్ (EOL) వాహనాలు అంటారు. అంటే వాటి జీవిత కాలం ముగిసిందని అర్థం.

ఢిల్లీలోని దాదాపు 500 పెట్రోల్ పంపుల దగ్గర ANPR కెమెరాలు అమర్చారు. ఈ కెమెరాలు ఏం చేస్తాయంటే, మీరు పంపులోకి రాగానే మీ బండి నెంబర్ ప్లేట్‌ను ఆటోమేటిక్‌గా స్కాన్ చేస్తాయి. ఆ వెంటనే ఆ సమాచారాన్ని ప్రభుత్వ డేటాబేస్‌తో పోల్చి చూస్తాయి. మీ బండి ఎంత పాతది, అది పెట్రోలా డీజిలా అని వెంటనే తెలిసిపోతుంది. ఒకవేళ మీ బండి 'ఎండ్-ఆఫ్-లైఫ్' కేటగిరీలో ఉంటే, వెంటనే పంపు వాళ్ళకి ఈ బండికి పెట్రోల్/డీజిల్ పోయొద్దు అని అలర్ట్ వస్తుంది. ఇప్పటికే ఈ సిస్టమ్ 3.63 కోట్ల బండ్లను చెక్ చేసిందట. అందులో 4.90 లక్షల బండ్లు చాలా పాతవని గుర్తించింది.

ఈ కొత్త రూల్ కేవలం ఢిల్లీకే పరిమితం కాదు. నవంబర్ 1వ తేదీ నుంచి ఇది గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్, ఇంకా సోనిపట్ లాంటి ప్రాంతాలకు కూడా వస్తుంది. ఆ తర్వాత, 2026 ఏప్రిల్ 1 నుంచి ఎన్సీఆర్ లోని మిగిలిన ప్రాంతాలన్నిటికీ ఇది వర్తిస్తుంది. ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం వాయు కాలుష్యాన్ని తగ్గించడమే. పాత బండ్ల నుంచి వచ్చే పొగ వల్లే గాలి చాలా పాడైపోతుంది. అందుకే, ఈ పాత బండ్లని రోడ్ల మీద నుంచి తీసేస్తే గాలి స్వచ్ఛంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రూల్స్ పక్కాగా అమలు చేయడానికి ఢిల్లీ రవాణా శాఖ 100 టీమ్‌లను ఏర్పాటు చేసింది. వీళ్ళు నిరంతరం చెకింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి, మీ వాహనం పాతదైతే, వెంటనే PUC (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికేట్ చెక్ చేసుకోండి. లేకపోతే, జులై 1 నుంచి పెట్రోల్ బంకులో ఇంధనం దొరకకపోవచ్చు.

Tags:    

Similar News