BMW F 450 GS : రోడ్లపైకి BMW కొత్త అడ్వెంచర్ బైక్.. 450cc ఇంజన్‌తో పవర్ ఫుల్ రైడ్.. ఇప్పుడే బుక్ చేసుకోండి
ఇప్పుడే బుక్ చేసుకోండి
BMW F 450 GS : అడ్వెంచర్ బైక్ ప్రేమికుల కలల బైక్ వచ్చేస్తోంది. జర్మన్ లగ్జరీ బైక్ తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ తన సరికొత్త సంచలనం BMW F 450 GS కోసం ప్రీ-బుకింగ్స్‌ను భారత్‌లో ప్రారంభించింది. ఏప్రిల్ 23, 2026న అధికారికంగా లాంచ్ కానున్న ఈ బైక్, ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అడ్వెంచర్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ జర్మన్ బుల్లెట్ సిద్ధమైంది. BMW F 450 GS లో సరికొత్తగా అభివృద్ధి చేసిన 450cc, పారలల్-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 48 hp పవర్, 43 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని బీఎమ్‌డబ్ల్యూ సంస్థ తన చిరకాల మిత్రుడు టీవీఎస్‌తో కలిసి రూపొందించింది. ఇందులో క్విక్షిఫ్టర్ ప్రో ఫీచర్ ఉండటం వల్ల, క్లచ్ అవసరం లేకుండానే గంటల కొద్దీ గేర్లు మారుస్తూ ప్రయాణించవచ్చు. ఇది లాంగ్ రైడ్స్ వెళ్లే వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
చూడగానే ఆకట్టుకునేలా ఈ బైక్ డిజైన్ ఉంటుంది. తన పెద్దన్న R 1300 GS నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన దీని హెడ్ లైట్ లో X ఆకారపు DRLs హైలైట్ గా నిలుస్తాయి. పదునైన సైడ్ ఫెయిరింగ్స్, ఆకట్టుకునే ఫ్యూయల్ ట్యాంక్, ముక్కు లాంటి ఫ్రంట్ ఎక్స్‌టెన్షన్ దీనికి పక్కా అడ్వెంచర్ లుక్ ఇస్తాయి. ఈ బైక్ బరువు కేవలం 175 కిలోలు మాత్రమే ఉండటం వల్ల కఠినమైన దారుల్లో కూడా సునాయాసంగా నడపవచ్చు. ఇది కాస్మిక్ బ్లాక్, రేసింగ్ రెడ్ అనే రెండు అదిరిపోయే రంగుల్లో లభ్యం కానుంది.
రైడర్ల సౌకర్యం కోసం BMW ఇందులో అత్యాధునిక టెక్నాలజీని జొప్పించింది. ఇందులో కలర్ TFT డిస్ప్లే ఉంటుంది, దీనిని బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా హీటెడ్ గ్రిప్స్, అడ్జస్టబుల్ లీవర్లు, ఈజీ రైడ్ క్లచ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముందు వైపు 19 అంగుళాల వీల్, వెనుక 17 అంగుళాల వీల్ ఉండటం వల్ల ఆఫ్-రోడింగ్ లో అద్భుతమైన గ్రిప్ లభిస్తుంది. 43 మిమీ USD ఫోర్క్ సస్పెన్షన్ ఉండటం వల్ల గుంతల రోడ్లపై కూడా ప్రయాణం స్మూత్ గా సాగుతుంది.
ఈ అద్భుతమైన బైక్ ఏప్రిల్ 23, 2026న అధికారికంగా మార్కెట్లోకి వస్తుంది. అయితే పెరుగుతున్న క్రేజ్ దృష్ట్యా కంపెనీ ముందే బుకింగ్స్ ప్రారంభించింది. ఆసక్తి గల కస్టమర్లు తమ సమీపంలోని BMW మోటోరాడ్ డీలర్‌షిప్‌ను సందర్శించి అడ్వాన్స్ పేమెంట్ తో బైక్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు. అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్‌లో ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న పోటీ బైక్ లకు ఇది గట్టి పోటినివ్వడం ఖాయం.