BMW: భారత్‌లోకి కొత్త బీఎండబ్ల్యూ అడ్వెంచర్ బైక్.. రూ.5.90 లక్షల ధరతో లాంచ్!
రూ.5.90 లక్షల ధరతో లాంచ్!
BMW: ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ మోటారాడ్ భారత టూ వీలర్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తూ మరో సరికొత్త అడ్వెంచర్ బైక్‌ను ప్రవేశపెట్టింది. మోటార్ సైకిల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్ స్పోర్ట్ దేశీయ మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఈ అడ్వెంచర్ బైక్ ఎక్స్ షోరూం ధరను రూ. 5.90 లక్షలుగా కంపెనీ ఫిక్స్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎక్స్‌క్లూజివ్, జీఎస్ ట్రోఫీ మోడళ్ల మధ్య సరికొత్త వేరియంట్‌గా ఇది నిలవనుంది.
ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం ప్రత్యేక ఫీచర్లు
కొత్త స్పోర్ట్ వేరియంట్లో రైడర్ల సౌలభ్యం కోసం అదిరిపోయే టెక్నాలజీని జోడించారు. ముఖ్యంగా గుంతల రోడ్లు, బురద ప్రాంతాల్లో రైడింగ్ సులభం కావడానికి ప్రత్యేక స్పోర్ట్ సస్పెన్షన్‌ను అమర్చారు. ఇందులో ఉన్న గేర్ షిఫ్ట్ అసిస్టెంట్ ప్రో ఫీచర్ ద్వారా క్లచ్ నొక్కాల్సిన అవసరం లేకుండానే గేర్లు మార్చవచ్చు. దీంతో ట్రాఫిక్ లేదా లాంగ్ రైడ్స్‌లో డ్రైవింగ్ మరింత సులభంగా మారుతుంది. అంతేకాకుండా రైడింగ్ మోడ్స్ ప్రో , ఎండ్యూరో ప్రో మోడ్స్ రావడం వల్ల కఠినమైన దారుల్లోనూ బైక్‌ను సులభంగా కంట్రోల్ చేయవచ్చు.
రేసింగ్ రెడ్ లుక్ అదుర్స్
డిజైన్ పరంగా ఈ బైక్ రోడ్డుపై వెళుతుంటే అందరి చూపు దీనిపైనే నిలిచేలా రూపొందించారు. ప్రత్యేకమైన రేసింగ్ రెడ్ కలర్ ఆప్షన్లో ఇది మరింత దూకుడుగా కనిపిస్తుంది. ముందు భాగంలో ఎక్స్-షేప్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, అడ్వెంచర్ బైక్ స్టైల్ ఫ్రంట్ బీక్ ఉన్నాయి. సుదూర ప్రయాణాల్లో గాలి తాకిడి తగలకుండా క్లియర్ రాలీ విండ్‌స్క్రీన్ ఇచ్చారు. బ్లాక్ హ్యాండ్‌గార్డ్స్, ఆఫ్-రోడ్ ఫుట్‌పెగ్స్, ప్లాస్టిక్ ఇంజిన్ గార్డ్ వంటి అంశాలు ఈ బైక్‌కు పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తున్నాయి.
జీఎస్ ట్రోఫీ కంటే తక్కువ ధర
ఈ బైక్ హుడ్ కింద 420సీసీ కెపాసిటీ కలిగిన లిక్విడ్-కూल्ड ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇది గరిష్టంగా 48 బీహెచ్పీ పవర్‌ను, 43 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇంజిన్‌కు జతగా 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానించబడి ఉంది. జీఎస్ ట్రోఫీ వేరియంట్‌తో పోలిస్తే ఇందులో ఈజీ రైడ్ క్లచ్ సిస్టమ్ ఉండదు, సాధారణ క్లచ్ లభిస్తుంది. అదే సమయంలో జీఎస్ ట్రోఫీ మోడల్‌కంటే ఇది సుమారు రూ. 25,000 తక్కువ ధరకు లభిస్తుండటం విశేషం.
నాలుగు వేరియంట్లలో లభ్యం
ఈ కొత్త స్పోర్ట్ మోడల్ రాకతో ఇప్పుడు భారత మార్కెట్లో బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్ సిరీస్ మొత్తం నాలుగు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. బేస్, ఎక్స్‌క్లూజివ్, జీఎస్ ట్రోఫీ మోడళ్లతో పాటు ఇప్పుడు ఈ స్పోర్ట్ వేరియంట్ చేరడంతో బడ్జెట్, అవసరాలకు తగినట్లుగా ఎంచుకోవడానికి కస్టమర్లకు మంచి అవకాశం దక్కింది. అడ్వెంచర్ బైక్ మార్కెట్లో ఈ సరికొత్త యంత్రం రాయల్ ఎన్ఫీల్డ్, కేటీఎం వంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.