Bike Mileage Tips : బైక్ మైలేజ్ పడిపోతోందా? అయితే వెంటనే ఈ ఒక్క పార్ట్ చెక్ చేయండి

ఈ ఒక్క పార్ట్ చెక్ చేయండి

Update: 2026-07-10 10:51 GMT

Bike Mileage Tips : ఈ రోజుల్లో ఉద్యోగస్తులు, కాలేజీ విద్యార్థులు నిత్యం ప్రయాణాల కోసం బైక్‌లను వాడుతుంటారు. పెట్రోల్ ధరలు మండిపోతున్న తరుణంలో బైక్ మంచి మైలేజ్ ఇవ్వడం అందరికీ ఎంతో ముఖ్యం. సాధారణంగా మైలేజ్ పెంచుకోవడానికి టైర్లలో గాలి సరిగ్గా ఉంచడం, మంచి క్వాలిటీ పెట్రోల్ కొట్టించడం, టైమ్‌కు ఇంజన్ ఆయిల్ మార్చడం వంటివి చేస్తుంటారు. కానీ, వీటన్నింటితో పాటు బైక్ మైలేజ్, పర్ఫార్మెన్స్‌ను శాసించే మరో ముఖ్యమైన భాగాన్ని చాలా మంది పూర్తిగా మర్చిపోతుంటారు. అదే బైక్ చైన్. బైక్ చైన్ సరైన స్థితిలో లేకపోతే అది నేరుగా ఇంజన్ సామర్థ్యాన్ని దెబ్బతీసి, పెట్రోల్ వినియోగాన్ని విపరీతంగా పెంచేస్తుంది.

బైక్ చైన్ సెట్టింగ్‌కు, మైలేజ్‌కు ఉన్న లింక్ ఏంటి?

బైక్ ఇంజన్ ఉత్పత్తి చేసే శక్తిని వెనుక చక్రానికి చేరవేసి బండి ముందుకు సాగేలా చేయడంలో చైన్ కీలక పాత్ర పోషిస్తుంది. చైన్ కరెక్ట్ టెన్షన్ లో ఉండి, దానికి తగినంత గ్రీజు లేదా లూబ్రికెంట్ రాసినప్పుడు ఇంజన్ పవర్ చాలా స్మూత్‌గా చక్రానికి బదిలీ అవుతుంది. దీనివల్ల ఇంజన్‌పై ఎలాంటి అదనపు భారం పడదు కాబట్టి బైక్ సూపర్ మైలేజ్ ఇస్తుంది. ఒకవేళ చైన్ లూజ్‌గా ఉన్నా లేదా మరీ టైట్‌గా ఉన్నా పవర్ ట్రాన్స్‌ఫర్ సరిగ్గా జరగదు. ఫలితంగా చక్రం తిరగడానికి ఇంజన్ ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఇంజన్‌పై లోడ్ పెరిగిన ప్రతిసారీ పెట్రోల్ ఎక్కువగా ఖర్చవుతుందని రైడర్స్ గమనించాలి.

చైన్ మరీ లూజ్‌గా ఉన్నా.. లేదా ఎక్కువ టైట్‌గా ఉన్నా వచ్చే నష్టాలు ఇవే

బైక్ నడుపుతున్నప్పుడు చైన్ లూజ్‌గా ఉంటే ఖట ఖట అంటూ విచిత్రమైన శబ్దాలు వస్తాయి. గేర్లు మార్చేటప్పుడు బైక్ ఒక్కసారిగా జట్కా ఇస్తుంది. అలాగే మనం యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు బండి మునుపటిలా స్మూత్‌గా వెళ్లకుండా మొరాయిస్తుంది. కొన్నిసార్లు లూజ్ చైన్ స్పాకెట్ పళ్లపై సరిగ్గా కూర్చోక చైన్ ఊడిపోయే ప్రమాదం కూడా ఉంది. అదేవిధంగా, చైన్ టైట్‌గా ఉంటే బండి బాగా వెళ్తుందని కొందరు భావిస్తారు కానీ అది ముమ్మాటికీ అపోహే. చైన్ మరీ బిగుతుగా ఉంటే అది ఇంజన్, గేర్‌బాక్స్ మరియు వీల్ బేరింగులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి, చైన్ త్వరగా తెగిపోయేలా చేస్తుంది. దీనివల్ల తర్వాత భారీగా ఖర్చు పెట్టి రిపేర్ చేయించాల్సి వస్తుంది.

బైక్ చైన్ కండిషన్‌ను ఇలా ఈజీగా కనిపెట్టేయండి

మీ బైక్ చైన్ కరెక్ట్‌గా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ముందుగా బైక్‌ను డబుల్ స్టాండ్ పై నిలబెట్టాలి. ఆ తర్వాత చైన్‌ను చేత్తో పైకి, కిందికి కదిపి చూడాలి. సాధారణంగా చైన్‌లో 20 నుంచి 30 మిల్లీమీటర్ల మేర ఫ్రీ మూవ్‌మెంట్ ఉండటం కరెక్ట్ సెట్టింగ్. అంతకంటే ఎక్కువ లూజ్‌గా ఉన్నా, లేదా అస్సలు కదలకుండా గట్టిగా ఉన్నా వెంటనే మెకానిక్ దగ్గరకు వెళ్లి అడ్జస్ట్ చేయించుకోవాలి. మీ బైక్ ఓనర్ మాన్యువల్ బుక్‌లో కూడా దీనికి సంబంధించిన ఖచ్చితమైన కొలతలు ఉంటాయి. ప్రతి 500 కిలోమీటర్లకు ఒకసారి చైన్ క్లీన్ చేసి లూబ్రికేట్ చేయడం వల్ల చైన్ లైఫ్ పెరుగుతుంది.

మైలేజ్ పెంచే మరికొన్ని సింపుల్ టిప్స్

కేవలం చైన్ మాత్రమే కాకుండా, మీ రైడింగ్ అలవాట్లు కూడా మైలేజ్‌ను ప్రభావితం చేస్తాయి. ట్రాఫిక్‌లో పదే పదే సడన్ బ్రేకులు వేయడం, అవసరం లేకపోయినా యాక్సిలరేటర్ ఎక్కువగా తిప్పడం, తక్కువ స్పీడ్‌లో ఎక్కువ గేర్ లేదా ఎక్కువ స్పీడ్‌లో తక్కువ గేర్ వేసి నడపడం వల్ల పెట్రోల్ త్వరగా అయిపోతుంది. అలాగే బైక్‌పై పరిమితికి మించి బరువులు వేసుకుని ప్రయాణించడం కూడా మైలేజ్‌ను తగ్గిస్తుంది. బైక్ మైలేజ్ ఎల్లప్పుడూ టాప్ కండిషన్‌లో ఉండాలంటే క్రమం తప్పకుండా టైమ్ టు టైమ్ సర్వీసింగ్ చేయించడం, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ ఉంచుకోవడం, స్పార్క్ ప్లగ్ మార్చడం, టైర్లలో ఎయిర్ ప్రెషర్ కరెక్ట్‌గా మెయింటైన్ చేయడం చాలా అవసరం.

Tags:    

Similar News