Electric Scooters : చార్జింగ్ పెట్టేసి జాలీగా తిరిగేస్తున్నారు.. స్కూటర్ల అమ్మకాల్లో కొత్త రికార్డులు

స్కూటర్ల అమ్మకాల్లో కొత్త రికార్డులు

Update: 2026-07-21 08:42 GMT

Electric Scooters : భారతీయ ద్విచక్ర వాహన రంగాన్ని ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏలేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఈవీ వాహనాల విక్రయాలు రాకెట్ వేగంతో పుంజుకున్నాయి. జూన్ 2026 నాటి దేశీయ టాప్-10 స్కూటర్ల విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఇప్పటిదాకా మార్కెట్‌లో సంచలనం సృష్టించిన పెట్రోల్ స్కూటర్ల హవాకు చెక్ పెడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయాల్లో టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, అథర్ రిజ్తా అనే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్ల త్రయం అంతకుముందు మార్కెట్లో పాతుకుపోయిన యామహా రే, సుజుకి బర్గ్‌మన్, హీరో డెస్టినీ 125 వంటి పాపులర్ పెట్రోల్ మోడళ్లను వెనక్కి నెట్టి విక్రయాల్లో రెట్టింపు హవా సాగిస్తున్నాయి.

జూన్ 2026 స్కూటర్ల సేల్స్ చార్ట్.. ఐక్యూబ్ హవా

జూన్ 2026 విక్రయాల చార్ట్‌లో హోండా యాక్టివా (2,18,932 యూనిట్లు), టీవీఎస్ జూపిటర్ (1,36,805), సుజుకి యాక్సెస్ (63,121) మొదటి మూడు స్థానాల్లో నిలవగా.. నాలుగో స్థానంలో ఏకంగా 47,331 యూనిట్ల అమ్మకాలతో టీవీఎస్ ఐక్యూబ్ నిలిచింది. ఇది గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 232% అపారమైన వృద్ధిని కనబరిచింది. ఐదో స్థానంలో ఉన్న బజాజ్ చేతక్ 40,376 యూనిట్లు (126% వృద్ధి), ఏడో స్థానంలో నిలిచిన అథర్ రిజ్తా 24,742 యూనిట్ల సేల్స్ నమోదు చేశాయి. ఇవి ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో నిలిచిన యామహా రే (22,782), సుజుకి బర్గ్‌మన్ (22,454), హీరో డెస్టినీ 125 (22,010) ల కంటే స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నాయి.

టీవీఎస్ ఐక్యూబ్ ప్రత్యేకతలు.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు

ఐక్యూబ్ సేల్స్ ఇంతలా ఎగబాకడానికి దాని ఫీచర్లే ప్రధాన కారణం. ఇందులో స్మార్ట్ LED హెడ్‌ల్యాంప్‌లు, బ్యాక్‌రెస్ట్, టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 32 లీటర్ల భారీ అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి. బ్యాటరీ విషయానికొస్తే 2.2 kWh, 3.1 kWh, 3.5 kWh, మరియు 5.5 kWh వంటి వివిధ రకాల ఆప్షన్లలో లభిస్తోంది. ఇది ఐక్యూబ్, ఐక్యూబ్ S, ఐక్యూబ్ ST అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతోంది. బేస్ వేరియంట్ ఒక్క ఛార్జ్‌పై 94 కి.మీ రేంజ్ ఇస్తుండగా, టాప్ వేరియంట్ ST ఏకంగా 212 కి.మీ డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. 4.4 kW మోటార్ సాయంతో కేవలం 4.2 సెకెన్లలోనే 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. IP67 రేటెడ్ వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ బ్యాటరీ, లైవ్ ఛార్జింగ్ స్టేటస్, అలెక్సా కనెక్టివిటీ, మ్యూజిక్/కాల్ కంట్రోల్స్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లు దీని సొంతం.

10 లక్షల యూనిట్ల సంచలనం

టీవీఎస్ మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగం మే 2026 నాటికే 10 లక్షల (1 మిలియన్) యూనిట్ల సేల్స్ మైలురాయిని దాటేసింది. ఈ మైలురాయిలో సింహభాగం ఐక్యూబ్ స్కూటర్‌దే కావడం గమనార్హం. మొదటి 1 లక్ష యూనిట్లు అమ్ముడవడానికి 3 ఏళ్లు పట్టగా, తదుపరి 5 లక్షల యూనిట్ల సేల్స్ కేవలం 16 నెలల్లోనే జరిగాయి. దేశవ్యాప్తంగా 3,000 కంటే ఎక్కువ నగరాల్లో 3,300 కి పైగా టచ్ పాయింట్లు కలిగి ఉండటం టీవీఎస్ నెట్‌వర్క్ బలాన్ని తెలియజేస్తోంది.

Tags:    

Similar News