Bike Sales : పల్లెల్లో బడ్జెట్ బైక్ ఫెస్టివల్.. సమ్మర్ లో అదరగొట్టిన హీరో, టీవీఎస్!

సమ్మర్ లో అదరగొట్టిన హీరో, టీవీఎస్!;

Update: 2025-06-16 11:01 GMT

Bike Sales : దేశంలో ఎంట్రీ-లెవెల్ మోటార్‌సైకిల్స్ అంటే ముఖ్యంగా 110 నుండి 125 సీసీ సెగ్మెంట్ బైకులకి ఇటీవల కాలంలో గ్రామాల్లో డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ కేటగిరీ అమ్మకాలు ఏకంగా 12.7శాతం పెరిగాయి. మొత్తం 36 లక్షల యూనిట్ల బైకులు అమ్ముడయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం వల్లనే ఈ ఊపు ఇలా కొనసాగుతుందని ఆటోరంగ నిపుణులు చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే మోటార్‌సైకిల్ మార్కెట్ కేవలం 5.1శాతం మాత్రమే పెరిగింది. కానీ మన ఎంట్రీ-లెవెల్ బైకులు మాత్రం ఈ మార్కెట్ పెర్ఫార్మెన్స్‌ని కూడా దాటిపోయాయి. 2023-24లో మొత్తం మోటార్‌సైకిల్ అమ్మకాల్లో ఈ కేటగిరీ వాటా 27.4శాతం ఉంటే, అది ఇప్పుడు 29శాతానికి పైగా పెరిగిపోయింది. అంటే మన భారతీయ కస్టమర్‌లు ఈ సెగ్మెంట్‌ని ఎంతగానో ఇష్టపడుతున్నారని దీని ద్వారా క్లియర్‌గా అర్థమవుతుంది.

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) అధ్యక్షుడు సీఎస్ విఘ్నేశ్వర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయనే అంచనా, ఇంకా తక్కువ వడ్డీ రేట్ల వల్ల డిమాండ్ ఇలాగే కొనసాగుతుందని చెప్పారు. ఆయన చెప్పిన మాటల్లో నిజం ఉంది. ఎంట్రీ-లెవెల్ బైకులు కొనేవాళ్లు వడ్డీ రేట్లను చాలా సీరియస్‌గా చూస్తారు. వడ్డీ రేట్లు తగ్గితే వాళ్ళ నెలవారీ EMIలు తగ్గుతాయి. అందుకే డిమాండ్ మరింత పెరుగుతుంది. ప్రస్తుతానికి, మొత్తం టూ-వీలర్ అమ్మకాల్లో ఈ కేటగిరీ బైకుల వాటా 18శాతం ఉంది, అయితే 125 సీసీ కంటే తక్కువ బైకుల వాటా 29శాతం ఉంది. కానీ ఎక్కువ పవర్ఫుల్ బైకులకు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ రేషియో కొద్దికొద్దిగా తగ్గుతోంది.

ప్రైమస్ పార్ట్‌నర్స్ వైస్ ప్రెసిడెంట్ నిఖిల్ ఢాకా ప్రకారం.. ఈ సెగ్మెంట్ ఇప్పటికీ చాలా ముఖ్యమైనదని. గ్రామీణ మార్కెట్ మెరుగుపడటం, కొత్త మోడల్స్ లాంచ్ అవ్వడం వల్ల డిమాండ్ అలాగే ఉంటుంది. దాని గ్రోత్ రేట్ కొంచెం తక్కువైనా సరే, మార్కెట్లో దీని ప్రాధాన్యత తగ్గదని ఆయన తెలిపారు. 100 సీసీ సెగ్మెంట్‌లో దీని మార్కెట్ వాటా ఏకంగా 90శాతం పైనే ఉంది. అంతేకాదు, కంపెనీ 125 సీసీ సెగ్మెంట్‌లో కూడా అదరగొట్టింది. దాని ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ బైకు ఏకంగా 3 లక్షల యూనిట్లు అమ్ముడైంది. దీనివల్ల ఈ కేటగిరీలో హీరో వాటా 2.5శాతం పెరిగింది. ప్రొడక్ట్ అప్‌గ్రేడ్‌లు, మంచి మార్కెటింగ్, ఇంకా డిజిటల్ ఫైనాన్స్ ఆప్షన్ల ద్వారా ఈ గ్రోత్‌ను అలాగే నిలబెట్టుకుంటామని వారు తెలిపారు.

టీవీఎస్ మోటార్ కంపెనీ కూడా తన రైడర్ 125 బైకుతో ఈ సెగ్మెంట్‌లో మంచి పట్టు సాధిస్తోంది. రైడర్‌కి భారతదేశంలోనే కాదు, ప్రపంచ మార్కెట్లలో కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఇక బజాజ్ ఆటో కూడా 125 సీసీ సెగ్మెంట్‌లో ఒక చౌక బైకును లాంచ్ చేయడానికి రెడీ అవుతోందని హింట్ ఇచ్చింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ప్రకారం, 2023లో బజాజ్ వాటా ఈ సెగ్మెంట్‌లో 21శాతం ఉంటే, 2024లో అది 26శాతానికి పెరిగింది. అయితే 2025లో ఇది 24శాతానికి తగ్గింది. ఇప్పుడు కంపెనీ మళ్ళీ దీనిని పెంచడంపైనే దృష్టి పెట్టింది. మొత్తంగా చూస్తే, గ్రామీణ మార్కెట్లో చిన్న బైకుల హవా కొనసాగుతోంది.

Tags:    

Similar News