Hero Vida : కేకేఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్.. విడా నుంచి స్పెషల్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్

విడా నుంచి స్పెషల్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్

Update: 2026-03-26 13:13 GMT

Hero Vida : హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ విడా, ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైంది. నైట్స్ అన్‌ప్లగ్డ్ 3.0 ఈవెంట్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) థీమ్‌తో కూడిన సరికొత్త VX2 Plus KKR లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కేకేఆర్ జట్టు రంగులైన పర్పుల్, గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో మెరిసిపోతున్న ఈ స్కూటర్, క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ కేవలం కొన్ని ఎంపిక చేసిన విడా అవుట్‌లెట్లలో మాత్రమే పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉంటుంది.

డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

విడా VX2 ప్లస్ కేకేఆర్ ఎడిషన్ డిజైన్ చాలా యూనిక్ గా ఉంది. పెర్ల్ బ్లాక్ బేస్ మీద పర్పుల్, గోల్డ్ కలర్ గ్రేడియంట్ డిజైన్, చిన్న చిన్న డాట్స్ డిటైలింగ్ స్కూటర్‌కు ప్రీమియం లుక్ ఇస్తాయి. కేకేఆర్ గెలిచిన మూడు ఐపీఎల్ టైటిళ్లకు గుర్తుగా మూడు ప్రత్యేక గుర్తులను బాడీపై ముద్రించారు. ఈ స్కూటర్ తో పాటు అదే థీమ్ లో ఉన్న హెల్మెట్ ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేకపోయినా, ఈ సరికొత్త రంగులు స్కూటర్ రూపురేఖలను మార్చేశాయి. ఈ స్పెషల్ ఎడిషన్ ధరను ఎక్స్-షోరూమ్ వద్ద రూ.1.16 లక్షలుగా నిర్ణయించారు.

విజేతలకు విడా గిఫ్ట్

ఈ భాగస్వామ్యంలో భాగంగా కేకేఆర్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ లో గెలిచిన తర్వాత, టీమ్ మేనేజ్మెంట్ ఎంపిక చేసిన ఒక ప్లేయర్ కు ఈ కస్టమైజ్డ్ VX2 ప్లస్ స్కూటర్ ను బహుమతిగా ఇస్తారు. విశేషమేమిటంటే, ఆ స్కూటర్ పై సదరు ప్లేయర్ పేరు, జెర్సీ నంబర్ కూడా రాసి ఉంటుంది. అంటే కేవలం అభిమానులకే కాదు, ఆటగాళ్లకు కూడా విడా ఈవీ ద్వారా ఒక స్పెషల్ మెమరీ లభించబోతోంది.

పవర్‌ఫుల్ బ్యాటరీ, రేంజ్

సాంకేతిక వివరాల్లోకి వెళ్తే.. విడా VX2 ప్లస్ లో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అంటే అపార్ట్‌మెంట్‌లలో ఉండేవారు బ్యాటరీని తీసి ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ క్లెయిమ్ ప్రకారం ఇది 142 కి.మీ రేంజ్ ఇస్తుంది, అయితే సాధారణ వినియోగంలో 100 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 62 నిమిషాల్లోనే 0-80% ఛార్జింగ్ పూర్తవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కి.మీ కాగా, కేవలం 3.1 సెకన్లలోనే 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. 18 డిగ్రీల వాలు ఉన్న రోడ్లను కూడా ఇది సులభంగా ఎక్కగలదు.

స్మార్ట్ ఫీచర్లు, భద్రత

ఈ స్కూటర్ లో ఫుల్ డిజిటల్ TFT డిస్‌ప్లే ఉంటుంది, ఇందులో నావిగేషన్, బ్యాటరీ లెవెల్ వంటి వివరాలు కనిపిస్తాయి. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా కాల్/SMS అలర్ట్లు పొందవచ్చు. ఎకో, రైడ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ కోసం కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS), ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. కీ-లెస్ స్టార్ట్, USB ఛార్జింగ్ పోర్ట్, 27 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, OTA అప్‌డేట్స్ వంటి ఫీచర్లు దీనిని ఒక పర్ఫెక్ట్ మోడ్రన్ ఈవీగా మార్చాయి.

Tags:    

Similar News