Honda City 2026 : హోండా సిటీ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు, లుక్.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే

అదిరిపోయే ఫీచర్లు, లుక్.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే

Update: 2026-05-14 13:20 GMT

Honda City 2026 : భారతీయ సెడాన్ మార్కెట్లో రాజసం అంటే గుర్తొచ్చే పేరు హోండా సిటీ. ఇప్పుడు ఆ రాజసాన్ని మరింత రెట్టింపు చేస్తూ హోండా సంస్థ హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సిద్ధం చేసింది. తాజాగా ఈ కారు మొదటిసారిగా ఎలాంటి కవర్లు లేకుండా రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాత వెర్షన్ కంటే ఇది మరింత స్మార్ట్‌గా, ప్రీమియంగా కనిపిస్తోంది. సెడాన్ కార్లను ఇష్టపడే వారికి ఇది ఒక పండుగ లాంటి వార్త అని చెప్పాలి.

ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో హోండా సంస్థ డిజైన్ పరంగా కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ముందు భాగంలో ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్‎లతో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్ లైట్లు కారుకు అగ్రెసివ్ లుక్ ఇస్తున్నాయి. గ్రిల్ డిజైన్ మార్చడంతో పాటు బోనెట్ పైన హోండా వారి కొత్త H లోగోను అమర్చారు. బంపర్ డిజైన్ కూడా మునుపటి కంటే వెడల్పుగా, షార్ప్‌గా ఉండటం వల్ల కారు రోడ్డుపై చాలా పవర్‌ఫుల్ గా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ పెద్దగా మారకపోయినా, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ కారుకు స్పోర్టీ టచ్ ఇచ్చాయి.

కారు లోపల అడుగుపెడితే మీకు ఒక లగ్జరీ ఫీల్ కలగడం ఖాయం. కొత్త సీటింగ్ అరేంజ్ మెంట్ తో పాటు డాష్ బోర్డులో పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఇక ఈసారి కస్టమర్ల కోరిక మేరకు 360-డిగ్రీ కెమెరా ఫీచర్‌ను జోడించారు. దీనివల్ల పార్కింగ్ చేయడం చాలా సులభం అవుతుంది. వీటితో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో హై బీమ్ అసిస్ట్ వంటి అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో 121 హార్స్‌పవర్, 145 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను హోండా కొనసాగిస్తోంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి (CVT) గేర్ బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. మైలేజీ గురించి ఆలోచించే వారి కోసం గతంలో లాగే 'హైబ్రిడ్ పవర్‌ట్రైన్' వెర్షన్ కూడా అందుబాటులో ఉండనుంది. ఇది ఒకసారి మార్కెట్లోకి వస్తే.. హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

Tags:    

Similar News