Honda SP 125 vs Bajaj Pulsar 125 : హోండా ఎస్పీ 125 వర్సెస్ బజాజ్ పల్సర్ 125.. మధ్యతరగతికి ఏది బెస్ట్ ఛాయిస్?

మధ్యతరగతికి ఏది బెస్ట్ ఛాయిస్?

Update: 2026-03-27 07:07 GMT

Honda SP 125 vs Bajaj Pulsar 125 : భారతీయ రోడ్ల మీద 125 సీసీ బైక్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అటు మైలేజీ, ఇటు పవర్ రెండింటినీ బ్యాలెన్స్ చేసే ఈ సెగ్మెంట్లో హోండా ఎస్పీ 125, బజాజ్ పల్సర్ 125 మధ్య ఎప్పుడూ గట్టి పోటీ ఉంటుంది. ఆఫీసు వెళ్లే వారికైనా, కాలేజీ కుర్రాళ్లకైనా ఈ రెండు బైకులు హాట్ ఫేవరెట్లే. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏది ఎవరికి సెట్ అవుతుంది? ఈ పూర్తి వివరాలు చూద్దాం.

లుక్ అండ్ డిజైన్

హోండా ఎస్పీ 125 చూడటానికి చాలా సింపుల్‌గా, ప్రీమియం కమ్యూటర్ లుక్‌తో ఉంటుంది. ఇది హుందాతనాన్ని ఇష్టపడే వారికి బాగా సెట్ అవుతుంది. మరోవైపు, బజాజ్ పల్సర్ 125 తన పెద్దన్నలైన 150, 220 సీసీ బైకుల బాడీని కలిగి ఉంటుంది. దీని మజిల్ ట్యాంక్, స్ప్లిట్ సీట్ సెటప్ దీనికి ఒక స్పోర్ట్స్ బైక్ ఫీల్‌ను ఇస్తాయి. స్టైల్ ముఖ్యం అనుకునే కుర్రాళ్లకు పల్సర్ 125 మొదటి ఛాయిస్ అవుతుంది.

ఇంజిన్ పర్ఫార్మెన్స్

హోండా ఎస్పీ 125లో 123.94 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 10.72 bhp పవర్, 10.9 Nm టార్క్‌ను అందిస్తుంది. హోండా ఇంజిన్ రిఫైన్‌మెంట్ చాలా బాగుంటుంది, అంటే ట్రాఫిక్‌లో కూడా సైలెంట్‌గా, స్మూత్‌గా వెళ్తుంది. ఇక బజాజ్ పల్సర్ 125 విషయానికి వస్తే.. ఇది 11.8 PS పవర్‌తో ఈ సెగ్మెంట్‌లోనే మోస్ట్ పవర్‌ఫుల్ బైక్‌లలో ఒకటిగా నిలిచింది. మీరు థొరాటిల్ తిప్పగానే పల్సర్ ఇచ్చే రెస్పాన్స్ అద్భుతంగా ఉంటుంది. వేగం ఇష్టపడే వారికి పల్సర్ బెస్ట్.

మైలేజ్ మరియు వెయిట్: జేబుకు ఏది దగ్గర?

ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లే వారికి మైలేజ్ చాలా ముఖ్యం. ఈ విషయంలో హోండా ఎస్పీ 125 లీటరుకు 60-65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తూ అగ్రస్థానంలో ఉంది. పల్సర్ 125 పవర్ మీద ఎక్కువ దృష్టి పెడుతుంది కాబట్టి దీని మైలేజ్ కొంచెం తక్కువగా ఉంటుంది. బరువు విషయానికి వస్తే హోండా కేవలం 116-117 కేజీలు మాత్రమే ఉంటుంది, కాబట్టి ట్రాఫిక్ గల్లీల్లో సులభంగా తిప్పవచ్చు. పల్సర్ 140 కేజీల బరువుతో రోడ్డు మీద గ్రిప్ బాగా ఇస్తుంది కానీ, తోసేటప్పుడు కొంచెం బరువుగా అనిపిస్తుంది.

ఫీచర్లు, సేఫ్టీ

టెక్నాలజీ పరంగా హోండా ఎస్పీ 125లో ఫుల్ డిజిటల్ కన్సోల్, సైలెంట్ ఏసీజీ స్టార్ట్, యూఎస్‌బీ చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పల్సర్ 125 ఒకడుగు ముందుకు వేసి బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్‌ఈడీ లైటింగ్, బ్యాక్‌లిట్ స్విచ్‌లతో వస్తోంది. సేఫ్టీ పరంగా రెండింటిలోనూ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆప్షన్లు ఉన్నాయి. పల్సర్ వెడల్పైన టైర్ల వల్ల హైవేల మీద మరింత స్టెబిలిటీని ఇస్తుంది.

ధరల వివరాలు

ధర విషయానికి వస్తే రెండింటి మధ్య పెద్దగా తేడా లేదు. హోండా ఎస్పీ 125 ప్రారంభ ధర సుమారు రూ. 87,878 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. బజాజ్ పల్సర్ 125 ధర రూ. 90,028 నుంచి మొదలవుతుంది. అంటే కేవలం రూ. 2 వేల తేడాతో మీకు పవర్ లేదా మైలేజీ అనే ఆప్షన్ లభిస్తోంది. ఫ్యామిలీ కోసం, మైలేజీ కోసం చూసే వారు హోండా ఎస్పీని, లుక్స్, వేగం కోసం చూసే వారు పల్సర్ 125ని ఎంచుకోవచ్చు.

Tags:    

Similar News