Honda Motors : బైక్ లాంటి స్కూటర్ వచ్చేసింది.. స్టైలిష్ డిజైన్, అదిరిపోయే ఫీచర్స్
స్టైలిష్ డిజైన్, అదిరిపోయే ఫీచర్స్;
Honda Motors : అడ్వెంచర్ బైక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా హోండా మోటార్స్ గ్లోబల్ మార్కెట్ కోసం తమ అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. అదే హోండా ఎక్స్-ఏడీవీ 2026 అడ్వెంచర్ స్కూటర్. ఈ కొత్త మోడల్ డిజైన్‌లో, ఫీచర్లలో, కొత్త రంగులలో మరింత మెరుగ్గా ఉంది. ఈ స్కూటర్ లుక్ అడ్వెంచర్ బైక్స్‌ను గుర్తు చేస్తుంది. హోండా ఎక్స్-ఏడీవీ స్కూటర్‌కు షార్ప్ డిజైన్ ఇచ్చారు. డ్యూయల్ LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్‌తో పాటు DRL లు దీనికి ఒక అద్భుతమైన లుక్‌ని ఇస్తాయి. పెద్ద విండ్‌స్క్రీన్, క్రాష్ గార్డ్, స్టెప్-అప్ సీట్, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ వంటి ఫీచర్లు దీన్ని మరింత స్టైలిష్‌గా మారుస్తాయి. 2026 హోండా ఎక్స్-ఏడీవీ మూడు కొత్త రంగుల్లో అందుబాటులో ఉంది: గ్రాఫైట్ బ్లాక్, పర్ల్ గ్లేర్ వైట్, మ్యాట్ డీప్ మడ్ గ్రే. అంతేకాకుండా, బ్లూ, రెడ్ కలర్ గ్రాఫిక్స్‌తో ఒక ప్రత్యేక ఎడిషన్ కూడా లాంచ్ చేయనుంది.
పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా హోండా ఈ కొత్త స్కూటర్‌లో రీసైక్లబుల్ భాగాలను ఉపయోగించింది. 2050 నాటికి 100% పర్యావరణ అనుకూల పదార్థాలను ఉపయోగించాలనే లక్ష్యంలో భాగంగా ఈ స్కూటర్ ఫెయిరింగ్, విండ్‌స్క్రీన్ డ్యూరాబియో బయోమాస్ ప్లాస్టిక్తో తయారు చేశారు. అలాగే, కారు బంపర్లను కూడా రీసైకిల్ చేసి సీట్, లగేజ్ బాక్స్ కోసం ఉపయోగించారు.
హోండా ఎక్స్-ఏడీవీలో 745సీసీ ప్యారలెల్-ట్విన్ ఇంజిన్ ఉంది. ఇది 58 bhp పవర్‌ను, 69 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT)తో వస్తున్న ఈ స్కూటర్, దేశంలో ఇలాంటి స్కూటర్లలో అరుదైనది. ఫ్రంట్‌లో డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్, ముందు 17-అంగుళాలు, వెనుక 15-అంగుళాల వైర్-స్పోక్ వీల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ మైల్డ్ ఆఫ్-రోడ్ రైడింగ్‌కు, టూరింగ్‌కు అనుకూలంగా ఉండేలా డిజైన్ చేశారు.