Hyundai Alcazar: సోఫా లాంటి సీట్లు.. హోటల్ లాంటి కంఫర్ట్.. హ్యుందాయ్ 7 సీటర్ పై రూ.90వేలు ఆదా
రూ.90వేలు ఆదా
Hyundai Alcazar: మీరు కుటుంబం మొత్తంతో కలిసి హ్యాపీగా ప్రయాణించడానికి మంచి 7 సీటర్ ఎస్‌యూవీ కారు కోసం చూస్తున్నారా? అయితే మీకో సూపర్ న్యూస్. పండుగ సీజన్ సందర్భంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తమ పాపులర్ ప్రీమియం 7 సీటర్ మోడల్ అల్కాజార్ పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు ప్రకటించింది. ఈ కార్ కొనుగోలుపై కస్టమర్లు గరిష్టంగా రూ.90,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. అధునాతన లగ్జరీ ఫీచర్లు, అడ్వాన్స్డ్ సేఫ్టీతో లభించే ఈ కారును సొంతం చేసుకోవడానికి ఇది నిజంగా మంచి అవకాశం.
ఈ ఆఫర్ల ద్వారా కస్టమర్లకు రూ.30,000 నేరుగా క్యాష్ డిస్కౌంట్ రూపంలో లభిస్తుంది. దీనికి అదనంగా రూ.25,000 నవరాత్రి బుకింగ్ బోనస్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.25,000 స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.10,000 అప్‌గ్రేడ్ బోనస్ కూడా సొంతం చేసుకోవచ్చు. కార్ల వేరియంట్లు, కస్టమర్ల ప్రొఫైల్ ఆధారంగా ఈ ప్రయోజనాలు మారుతుంటాయి. భారత మార్కెట్లో అల్కాజార్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.14.50 లక్షల నుంచి మొదలై టాప్ మోడల్ ధర రూ.21.95 లక్షల వరకు ఉంది.
అల్కాజార్ కార్‌లో రెండు పవర్ ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 158 బిహెచ్‌పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. దీనిలో 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఇక ప్రయాణ ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారి కోసం 1.5 లీటర్ డిజైల్ ఇంజిన్ కూడా ఉంది. ఇది 116 పిఎస్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్‌తో వస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానించారు.
కార్ లోపల సౌకర్యాల విషయానికి వస్తే సెకండ్ రో ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా వైర్‌లెస్ ఛార్జర్, రెండు టైప్-సి ఛార్జింగ్ పోర్టులు ఇచ్చారు. 6-సీటర్ వేరియంట్లలో సెకండ్ రోలో వెంటిలేటెడ్ కెప్టెన్ సీట్లు లభిస్తాయి. వీటిని బటన్ సహాయంతో సులభంగా ముందుకు, వెనక్కి సర్దుబాటు చేసుకోవచ్చు. డ్రైవర్ సీట్‌ను 8 రకాలుగా అడ్జస్ట్ చేసుకునే సదుపాయంతో పాటు మెమరీ ఫంక్షన్ ఇచ్చారు. డిజిటల్ కీ సాయంతో స్మార్ట్‌ఫోన్ ద్వారానే కారును లాక్, అన్‌లాక్ చేసుకోవడం మరో ప్రత్యేకత.
కుటుంబ సభ్యుల రక్షణే ధ్యేయంగా హ్యుందాయ్ ఈ కార్‌ను రూపొందించింది. ప్రయాణికుల రక్షణ కోసం ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు. వీటితో పాటు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీ ఉంది. ఇది రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రమాదాలను ముందుగానే గుర్తించి డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా బ్రేకింగ్, లైనింగ్ కంట్రోల్ చేస్తూ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మారుస్తుంది.