Hyundai Creta : క్రెటా కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్.. ఆ ఫేవరెట్ మోడల్స్ ఇక హిస్టరీయే

ఆ ఫేవరెట్ మోడల్స్ ఇక హిస్టరీయే

Update: 2026-05-09 10:13 GMT

Hyundai Creta : భారతీయ రోడ్లపై రారాజుగా వెలుగొందుతున్న హ్యుందాయ్ క్రెటా విషయంలో కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరికీ తెలియకుండానే తన వేరియంట్ లైన్అప్‌లో భారీ మార్పులు చేసింది. కస్టమర్లలో గందరగోళాన్ని తగ్గించేందుకో లేదా కొత్త వ్యూహంతోనో కానీ, క్రెటాలో ఉన్న కొన్ని పాపులర్ వేరియంట్లను హ్యుందాయ్ నిశ్శబ్దంగా తొలగించింది. హ్యుందాయ్ తన క్రెటా రేంజ్‌ను సులభతరం చేసే పనిలో భాగంగా SX Tech, SX(O) వంటి ప్రధాన వేరియంట్లను నిలిపివేసింది. వీటితో పాటు S పెట్రోల్/డీజిల్ మాన్యువల్, E డీజిల్ మాన్యువల్, S(O) నైట్ ఎడిషన్ వంటి ఇతర మోడళ్లు కూడా ఇకపై అందుబాటులో ఉండవు. ప్రస్తుతం క్రెటా కేవలం ఏడు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది: E, EX, EX(O), S(O), SX, SX ప్రీమియం, టాప్-ఎండ్ కింగ్ (King) వేరియంట్. దీని ధరలు రూ. 10.79 లక్షల నుంచి ప్రారంభమై రూ.19.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

ఈ మార్పుల వల్ల కస్టమర్లకు కలిగే అతిపెద్ద నష్టం ఏమిటంటే.. భద్రతకు సంబంధించిన ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్. గతంలో SX Tech వంటి వేరియంట్లలో అందుబాటులో ఉన్న లెవల్-2 ADAS ఫీచర్లను ఇప్పుడు కేవలం టాప్-స్పెక్ కింగ్ వేరియంట్‌కే పరిమితం చేశారు. అంటే ADAS కావాలనుకునే వారు ఇప్పుడు భారీగా ఖర్చు చేసి టాప్ మోడల్‌నే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇటీవలే లాంచ్ అయిన క్రెటా సమ్మర్ ఎడిషన్ మాత్రం మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

ఇంజన్, పవర్ వివరాలు

వేరియంట్లు మారినప్పటికీ ఇంజన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పు లేదు. క్రెటా మూడు రకాల ఇంజన్లతో వస్తుంది..

* 1.5 లీటర్ పెట్రోల్: 115 PS పవర్, 144 Nm టార్క్.

* 1.5 లీటర్ టర్బో పెట్రోల్: 160 HP పవర్, 260 Nm టార్క్.

* 1.5 లీటర్ టర్బో డీజిల్: 116 PS పవర్, 250 Nm టార్క్.

ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే 6-స్పీడ్ మాన్యువల్, iMT, CVT (IVT), 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ DCT ఆప్షన్లు యథావిధిగా కొనసాగుతున్నాయి.

ప్రీమియం ఫీచర్లు, సేఫ్టీ

టాప్-ఎండ్ క్రెటాలో లగ్జరీ ఫీచర్లు పుష్కలంగా ఉన్నాయి. 10.25 అంగుళాల ట్విన్ డిస్ప్లేలు (ఇన్ఫోటైన్‌మెంట్ & ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్), పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, బాస్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు.

Tags:    

Similar News