Hyundai : మధ్యతరగతి ప్రజలకు హ్యుందాయ్ బంపర్ ఆఫర్.. రూ.5.60 లక్షల కారుపై రూ.70,000 డిస్కౌంట్

రూ.5.60 లక్షల కారుపై రూ.70,000 డిస్కౌంట్

Update: 2026-07-03 14:19 GMT

Hyundai :ఈ జులై నెలలో బడ్జెట్ ఫ్రెండ్లీ కారును ఇంటికి తీసుకెళ్లాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తన మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు గ్రాండ్ ఐ10 నియోస్ పై భారీ తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. ఈ జులై 2026 అంతటా చెల్లుబాటయ్యే ఈ ప్రత్యేక ఆఫర్ కింద కస్టమర్లు ఏకంగా రూ.70,000 వరకు లబ్ధి పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్లు కేవలం ఎంపిక చేసిన మోడళ్లపై మాత్రమే అందుబాటులో ఉంటాయని, కారు బేస్ వేరియంట్ అయిన ఎరా పెట్రోల్ మోడల్‌కు ఈ తగ్గింపు వర్తించదని కంపెనీ స్పష్టం చేసింది.

గ్రాండ్ ఐ10 నియోస్ పెట్రోల్ వేరియంట్‌ను కొనుగోలు చేసే కస్టమర్ల కోసం హ్యుందాయ్ రకరకాల బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో నేరుగా రూ.30,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు పాత కారును మార్చుకునే వారికి రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ అందుబాటులో ఉంది. అలాగే మరో రూ.15,000 అప్‌గ్రేడ్ బోనస్ రూపంలో పొందవచ్చు. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు లేదా కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వారికి అదనంగా మరో రూ.5,000 లబ్ధి చేకూరుతుంది. మరోవైపు, పెట్రోల్ ఖర్చుల భారం తగ్గించుకోవాలనుకునే వారి కోసం కంపెనీ సీఎన్‌జీ వేరియంట్‌పై కూడా రూ.25,000 వరకు భారీ క్యాష్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

భారత మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.59 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ ధర రూ.8.04 లక్షల వరకు ఉంది. ఈ ధర పరిధిలో ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్, మారుతి వ్యాగన్ఆర్, మారుతి సెలెరియో, టాటా టియాగో వంటి పాపులర్ కార్లకు గట్టి పోటీని ఇస్తోంది. తక్కువ ధరలో మంచి మైలేజ్, ప్రీమియం లుక్ ఆశించే ఫ్యామిలీస్ ఈ కారును ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఇంజన్ పవర్, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌లో 1.2-లీటర్ సామర్థ్యం గల పవర్‌ఫుల్ కప్పా పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 83 పీఎస్ పవర్, 113.8 ఎన్ఎమ్ టాక్‌ను జనరేట్ చేస్తుంది. కస్టమర్ల డ్రైవింగ్ సౌకర్యం కోసం ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, ఏఎమ్‌టీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సులభంగా డ్రైవ్ చేయాలనుకునే వారికి ఈ ఏఎమ్‌టీ వేరియంట్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఫీచర్ల పరంగా చూస్తే ఈ కారు తన సెగ్మెంట్‌లోనే అత్యుత్తమ ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేసే 8 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లాంగ్ డ్రైవ్స్ కోసం క్రూజ్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్ కోసం టైప్-సి యూఎస్‌బీ ఛార్జర్, వెనుక సీట్లలో ఉన్నవారి కోసం రియర్ ఏసీ వెంట్స్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. భద్రతకు సైతం హ్యుందాయ్ పెద్దపీట వేసింది. ప్రయాణికుల రక్షణ కోసం ఈ కారులో సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లతో కలిపి మొత్తం 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా ఇచ్చారు. వీటితో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), హిల్ అసిస్ట్ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటి టాప్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లు ఈ చిన్న కారులో అందుబాటులో ఉన్నాయి.

Tags:    

Similar News