Maruti Suzuki Eeco : ఇండియాలో సూపర్ హిట్.. గ్లోబల్ మార్కెట్‌లో అట్టర్ ఫ్లాప్.. విచిత్రంగా మారుతి ఈకో పరిస్థితి

విచిత్రంగా మారుతి ఈకో పరిస్థితి

Update: 2026-08-01 07:23 GMT

Maruti Suzuki Eeco : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మారుతి సుజుకి ఈకో వ్యాన్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన దేశంలో ప్రతీ నెలా సగటున దాదాపు 11,000 యూనిట్లు అమ్ముడవుతూ అత్యంత ఆదరణ పొందిన వ్యాన్‌గా నిలుస్తోంది. మన దేశంలో లభించే అత్యంత చౌకైన 7-సీటర్ కారు కూడా ఇదే. అయితే ఎగుమతుల పరంగా చూస్తే మాత్రం ఈ కారుకు విదేశాల్లో దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ 2026 మధ్య కాలంలో మారుతి ఈకో ఎగుమతులు ఏకంగా 35.37 శాతం మేర పడిపోయాయి. ఈ మూడు నెలల వ్యవధిలో కంపెనీ కేవలం 1,608 యూనిట్ల ఈకో కార్లను మాత్రమే విదేశాలకు పంపించగలిగింది.

విశాలమైన కేబిన్,ఆకట్టుకునే డిజైన్

మారుతి సుజుకి ఈకో (టూర్ వి) కేబిన్ చాలా ఎత్తుగా, విశాలంగా ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు మంచి హెడ్‌రూమ్, లెగ్‌రూమ్ లభిస్తాయి. ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో మోడర్న్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్, ఫ్రంట్ కేబిన్ ల్యాంప్స్, ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు శక్తివంతమైన ఏసీ, హీటర్ ఆప్షన్లు ఇచ్చారు. ఈ కారు 5-సీటర్, 7-సీటర్ వేరియంట్లలో లభిస్తుంది. పెద్ద కుటుంబాలకు అలాగే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లడానికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది.

పవర్‌ఫుల్ ఇంజిన్ పెర్‌ఫార్మెన్స్

ఇంజిన్ విషయానికి వస్తే.. ఈకో వ్యాన్‌లో మారుతి సుజుకికి చెందిన అడ్వాన్స్‌డ్ 1.2-లీటర్ కే-సిరీస్ డ్యూయల్ జెట్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ పెట్రోల్ మోడ్‌లో 80.76bhp పవర్, 104.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే కంపెనీ ఫిట్టెడ్ సిఎన్‌జి వేరియంట్‌లో ఈ ఇంజిన్ 71.65bhp పవర్, 95Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ కారులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తుంది. ఇది నగరాల్లోని ట్రాఫిక్‌తో పాటు హైవేలపై కూడా డ్రైవింగ్‌ను చాలా స్మూత్‌గా మారుస్తుంది.

కిలో మీటర్‌కు అదిరిపోయే మైలేజ్

ఈకో పెట్రోల్ వేరియంట్ లీటరుకు 19.71 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ సైజ్ కారుకు ఇది చాలా మంచి మైలేజీగా చెప్పవచ్చు. ఇక రోజువారీ రన్నింగ్ ఖర్చులను బాగా తగ్గించుకోవాలనుకునే వారి కోసం రూపొందించిన సీఎన్‌జీ వేరియంట్ ఏకంగా 26.78 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. తక్కువ మెయింటెనెన్స్ కాస్ట్, ఎక్కువ మైలేజ్ ఇవ్వడం వల్లే ట్రావెల్స్, క్యాబ్ బిజినెస్ చేసేవారికి ఇది మొదటి ప్రాధాన్యతగా మారింది.

భద్రతా ఫీచర్లు, ధరల వివరాలు

వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే వాహనం అయినప్పటికీ, ప్రయాణికుల భద్రతకు మారుతి పెద్దపీట వేసింది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీ (EBD) తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి అవసరమైన సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా అందించారు. ఇక ధరల విషయానికి వస్తే మారుతి సుజుకి ఈకో టూర్ వి ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.20 లక్షల నుంచి ప్రారంభమై రూ. 6.38 లక్షల వరకు ఉంటుంది.

Tags:    

Similar News