Upcoming Boxy SUVs : స్టైల్ అంటే మనదే.. బాక్సీ లుక్‌తో మార్కెట్‌ను షేక్ చేయబోతున్న కొత్త ఎస్‌యూవీలివే

బాక్సీ లుక్‌తో మార్కెట్‌ను షేక్ చేయబోతున్న కొత్త ఎస్‌యూవీలివే

Update: 2026-04-23 09:07 GMT

Upcoming Boxy SUVs : భారతీయ రోడ్లపై ఇప్పుడు రఫ్ అండ్ టఫ్ లుక్ ఉన్న ఎస్‌యూవీల హవా నడుస్తోంది. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత ల్యాండ్ రోవర్ డిఫెండర్ స్టైల్‌లో ఉండే బాక్సీ డిజైన్ కార్లంటే మన వాళ్లు పడిచస్తున్నారు. దీన్ని గమనించిన మహీంద్రా, టాటా వంటి దిగ్గజ కంపెనీలు అదే బాటలో నడుస్తున్నాయి. రాబోయే కొద్ది నెలల్లో డిఫెండర్‌కు ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో, అదిరిపోయే పవర్,లుక్‌తో 5 కొత్త బాక్సీ ఎస్‌యూవీలు భారత మార్కెట్లోకి రాబోతున్నాయి.

1. మహీంద్రా విజన్ ఎస్

మహీంద్రా కంపెనీ తన పవర్‌ఫుల్ ఎస్‌యూవీ విజన్ ఎస్‎ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే దీని టెస్ట్ మోడల్స్ పలుమార్లు రోడ్లపై కనిపించాయి. ఇది మహీంద్రాకు చెందిన న్యూ ఐక్యూ ప్లాట్‌ఫామ్ పై ఆధారపడి రూపొందింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్.. ఇలా మూడు వెర్షన్లలో ఇది రానుంది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ లేదా 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో ఇది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

2. జెఎస్‌డబ్ల్యూ జెటూర్ టీ2

ప్రముఖ సంస్థ జెఎస్‌డబ్ల్యూ, చెర్రీ కలిసి జెటూర్ టీ2ను ఇండియాలో లాంచ్ చేయబోతున్నాయి. 2026 దీపావళి నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. విదేశాల్లో ఇది ఈవీ మోడల్‌లో ఉన్నప్పటికీ, భారత్‌లో మాత్రం హైబ్రిడ్ వెర్షన్‌లో రానుంది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 139 కిమీల ఎలక్ట్రిక్ రేంజ్‌ను కూడా ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

3. టాటా సియెర్రా ఈవీ

ఎస్‌యూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కారు టాటా సియెర్రా ఈవీ. 2026 మే నెలలో ఇది విడుదలయ్యే అవకాశం ఉంది. పాత సియెర్రా స్టైలిష్ బాక్సీ లుక్‌ను మెయింటెన్ చేస్తూనే, ఆధునిక ఎలక్ట్రిక్ ఫీచర్లతో దీన్ని రూపొందిస్తున్నారు. క్లోజ్డ్ గ్రిల్, స్ప్లిట్ హెడ్ ల్యాంప్ సెటప్, వెనుక వైపు ఫుల్-విడ్త్ ఎల్‌ఈడీ లైట్ బార్‌తో ఇది రోడ్లపై కొత్త ట్రెండ్ సృష్టించడం ఖాయం.

4. చెర్రీ ఐకౌర్ వి23

డిఫెండర్ లుక్‌ను దించేసినట్లు ఉండే మరో కారు చెర్రీ ఐకౌర్ వి23. జెఎస్‌డబ్ల్యూ భాగస్వామ్యంతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ 401 కిమీల రేంజ్‌ను ఇస్తుండగా, ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 510 కిమీల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. దీని పవర్, టార్క్ గణాంకాలు యువతను కచ్చితంగా ఆకట్టుకుంటాయి.

5. రెనాల్ట్ బ్రిడ్జర్

రెనాల్ట్ కంపెనీ కూడా బాక్సీ ఎస్‌యూవీ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ప్రస్తుతం కాన్సెప్ట్ స్టేజ్‌లో ఉన్న బ్రిడ్జర్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభించనుంది. దీని డిజైన్ కూడా పూర్తిగా బాక్సీ స్టైల్‌లో ఉంటుంది. ఇది 2027 మధ్య నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో రెనాల్ట్ కు ఇది ఒక పెద్ద మలుపు కానుంది.

Tags:    

Similar News