JSW MG Motor : మహీంద్రాకు ఎంజీ కొత్త సవాల్.. సింగిల్ ఛార్జ్‎తో 1100 కిమీ రేంజ్ ఇచ్చే సూపర్ ఎస్‌యూవీ

సింగిల్ ఛార్జ్‎తో 1100 కిమీ రేంజ్ ఇచ్చే సూపర్ ఎస్‌యూవీ

Update: 2026-04-01 10:59 GMT

JSW MG Motor : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తున్న వేళ, JSW MG మోటార్ ఇండియా మరో అడుగు ముందుకు వేస్తోంది. పెట్రోల్, ప్యూర్ ఎలక్ట్రిక్ కార్లకు మధ్య వారధిగా ఉండే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సెగ్మెంట్లోకి అడుగుపెడుతున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్‌డేట్ ఒకటి బయటకొచ్చింది. చైనా మార్కెట్లో పాపులర్ అయిన వ్యూలింగ్ స్టార్‌లైట్ 560 ఎస్‌యూవీ డిజైన్ పెటెంట్‌ను ఎంజీ మోటార్ ఇండియా మార్చి 2026లో ఫైల్ చేసింది. ఇది అక్టోబర్ 2026 నాటికి, అంటే దీపావళి కానుకగా భారత రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది.

ఏమిటీ స్టార్‌లైట్ 560?

అంతర్జాతీయ మార్కెట్లో వూలింగ్ స్టార్‌లైట్ 560 ఒక పెద్ద 7-సీటర్ ఎస్‌యూవీగా పేరు తెచ్చుకుంది. దీని పొడవు 4.7 మీటర్లకు పైగా ఉండటం వల్ల ఇది చూడటానికి చాలా భారీగా, ప్రీమియంగా కనిపిస్తుంది. భారత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎంజీ మోటార్ దీని డిజైన్ మరియు పేరులో చిన్న చిన్న మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ కారును ఎంజీ హేక్టార్, రాబోయే కొత్త మోడళ్ల మధ్య ఒక ప్రీమియం ఆప్షన్‌గా నిలబెట్టాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

1100 కిలోమీటర్ల మైలేజ్ రేంజ్

ఈ ఎస్‌యూవీలో అతిపెద్ద హైలైట్ దాని ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్, 20.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటాయి.

* ప్యూర్ ఈవీ మోడ్: పెట్రోల్ అవసరం లేకుండా కేవలం బ్యాటరీ పవర్ తోనే ఈ కారు 100 నుంచి 125 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

* ఫుల్ రేంజ్: పెట్రోల్, బ్యాటరీ కలిపి వాడితే ఏకంగా 1100 కిలోమీటర్ల వరకు నాన్-స్టాప్ గా ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

* పెర్ఫార్మెన్స్: ఇది సుమారు 194 bhp పవర్, 230 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, దీనివల్ల కేవలం 9.7 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 7XOతో ఢీ

మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ కారు నేరుగా మహీంద్రా XUV 7XO, టాటా సఫారీ వంటి దిగ్గజాలతో తలపడనుంది. రేంజ్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ విషయంలో ఎంజీ కారు ఈ రెండింటి కంటే ముందంజలో ఉండే అవకాశం ఉంది. అలాగే, భవిష్యత్తులో దీని ప్యూర్ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా వస్తుందని, అది మహీంద్రా XEV 9S, టాటా హారియర్ ఈవీలకు గట్టి పోటీ ఇస్తుందని సమాచారం.

ఫీచర్ల ఖజానా

ఈ ఎస్‌యూవీ లోపల ఎంజీ మార్క్ లగ్జరీ స్పష్టంగా కనిపిస్తుంది. 12.8-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 8.8-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 4G కనెక్టివిటీ, OTA అప్‌డేట్స్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6-స్పీకర్ ఆడియో సిస్టమ్, ADAS లెవల్-2 టెక్నాలజీ, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరా , వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి ప్రయాణికులకు పూర్తి భద్రతను ఇస్తాయి.

ధర, లభ్యత

అక్టోబర్ 2026లో లాంచ్ కాబోతున్న ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర సుమారు రూ.19 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ఉండవచ్చని అంచనా. హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల పెట్రోల్ ఖర్చులు భారీగా తగ్గుతాయి కాబట్టి, లాంగ్ జర్నీలు చేసే వారికి ఇది ఒక వరంగా మారుతుంది.

Tags:    

Similar News