Kawasaki : బైక్ లవర్స్‌కి బంపర్ ఆఫర్..కవాసకి సూపర్ బైక్‌పై రూ.2.50 లక్షల భారీ తగ్గింపు

కవాసకి సూపర్ బైక్‌పై రూ.2.50 లక్షల భారీ తగ్గింపు

Update: 2025-12-11 11:13 GMT

Kawasaki : సూపర్ బైక్ లవర్స్‌ కోసం కవాసకి సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ తమ 2026 కవాసకి నింజా ZX-10R సూపర్ బైక్‌పై ఏకంగా రూ.2.50 లక్షల భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ చాలా తక్కువ సమయం వరకు మాత్రమే ఉంటుంది. డిసెంబర్ 31, 2025 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆన్-రోడ్ ధరపై ఇంత పెద్ద తగ్గింపు తర్వాత, ZX-10R మొత్తం ధర ఇప్పుడు సుమారు రూ.21.10 లక్షల వరకు అవుతుంది, ఇది ఈ విభాగంలోని ఇతర సూపర్ బైక్‌లతో పోలిస్తే చాలా ఆకర్షణీయంగా ఉంది.

నింజా ZX-10R బైక్‌పై రూ.2.50 లక్షల ప్రత్యక్ష తగ్గింపు అనేది బైక్ కొనుగోలుదారులకు పెద్ద ప్రయోజనం. ఈ తరగతి సూపర్ బైక్‌లపై ఇంత భారీ తగ్గింపు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. కస్టమర్‌లకు ఇది ఆన్-రోడ్ ధరలో చాలా పెద్ద పొదుపును అందిస్తుంది. ఈ బైక్‌ను సెప్టెంబర్ 2025లో రూ.19.49 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేశారు.

ఈ బైక్‌లో 998సీసీ ఇన్లైన్ 4-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 13,000 ఆర్‌పిఎమ్ వద్ద 193 బీహెచ్‌పీ పవర్, 11,400 ఆర్‌పిఎమ్ వద్ద 112 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడింది. ఈ గణాంకాలు ZX-10R తన తరగతిలో పర్ఫామెన్స్ విషయంలో ఎవరికీ తీసిపోదని రుజువు చేస్తున్నాయి.

నింజా ZX-10R ట్యుబులర్ డైమండ్ ఫ్రేమ్ పై ఆధారపడి నిర్మించబడింది. ఇందులో ముందు భాగంలో యుఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక భాగంలో ఫుల్లీ-అడ్జస్టబుల్ మోనో-షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇది రేసింగ్ ట్రాక్, హైవే డ్రైవింగ్ రెండింటిలోనూ బైక్‌కు అద్భుతమైన స్టెబిలిటీ అందిస్తుంది. ఈ సూపర్ బైక్ బీఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్‌ఆర్, డుకాటి పానిగాలే వీ4 వంటి ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన లీటర్-క్లాస్ సూపర్ బైక్‌లతో నేరుగా పోటీ పడుతుంది.

ఈ బైక్ హై-పర్ఫార్మెన్స్ సూపర్ బైక్‌లను, ట్రాక్ రైడింగ్‌ను ఇష్టపడే వారి కోసం తయారు చేయబడింది. మీరు ఈ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్‌లో పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేయాలని అనుకుంటే ఇది సరైన సమయం. ఈ ప్రత్యేక ఆఫర్ డిసెంబర్ 31 లోపు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Tags:    

Similar News