Kawasaki Ninja 1100SX : సూపర్ బైక్ కొనాలనుకుంటున్నారా? నింజా 1100SX పై భారీ డిస్కౌంట్

నింజా 1100SX పై భారీ డిస్కౌంట్

Update: 2026-02-19 06:37 GMT

Kawasaki Ninja 1100SX : సూపర్ బైక్ ప్రియులకు కవాసాకి ఇండియా అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. తన పాపులర్ స్పోర్ట్ టూరర్ మోటార్‌సైకిల్ కవాసాకి నింజా 1100SX పై భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ఈ బైక్ కొనుగోలుపై ఏకంగా రూ.1.43 లక్షల ప్రయోజనాన్ని కంపెనీ అందిస్తోంది. నిజానికి ఈ ఆఫర్ జనవరి 31తో ముగియాల్సి ఉండగా, కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. దీంతో రూ.14.42 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉన్న ఈ బైక్ ధర ఇప్పుడు రూ.12.99 లక్షలకే అందుబాటులోకి వచ్చింది.

ఈ లీటర్-క్లాస్ స్పోర్ట్ టూరర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో 1,099cc, లిక్విడ్-కూల్డ్, ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 9,000 rpm వద్ద 136 PS గరిష్ట శక్తిని, 7,600 rpm వద్ద 113 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ ఇంజిన్, అటు సిటీ రోడ్లపై ఇటు లాంగ్ హైవే రైడ్లలోనూ స్మూత్, పవర్‌ఫుల్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు చేసే వారికి ఈ బైక్ ఒక అద్భుతమైన ఎంపిక.

ఫీచర్ల పరంగా కూడా నింజా 1100SX ఎక్కడా తగ్గలేదు. ఇందులో మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రైడర్‌కు కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. విండ్ ప్రొటెక్షన్ కోసం అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ దీని ప్రత్యేకత. సేఫ్టీ కోసం ముందు భాగంలో డ్యూయల్ 300ఎంఎం డిస్క్ బ్రేక్‌లు, వెనుక 260ఎంఎం డిస్క్ బ్రేక్‌లను అమర్చారు.

ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి, ఆసక్తి ఉన్న వారు వెంటనే తమ సమీపంలోని కావాసాకి డీలర్‌షిప్‌ను సంప్రదించడం ఉత్తమం. స్టాక్ ఉన్నంత వరకే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. కేవలం ధర తగ్గింపు మాత్రమే కాకుండా, డీలర్ స్థాయిలో అదనపు ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది. మార్కెట్లో ఈ బైక్ హోండా CB1000 హార్నెట్, డ్యుకాటి మాన్‌స్టర్, కేటీఎం 890 డ్యూక్ ఆర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

Tags:    

Similar News