Kia : టాటా, మహీంద్రాకు దడ పుట్టిస్తున్న కియా..రూ.14 లక్షలకే బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు
.రూ.14 లక్షలకే బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు
Kia : భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు కియా ఇండియా సిద్ధమవుతోంది. తన మొట్టమొదటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కారు కియా సైరోస్ EVని 2026 మధ్య నాటికి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ కారు రోడ్లపై ముమ్మరంగా టెస్టింగ్ జరుపుకుంటోంది. మార్కెట్లోకి వస్తే ఇది నేరుగా టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV 400 వంటి దిగ్గజ కార్లతో తలపడనుంది. సాధారణ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో, ప్రీమియం ఫీచర్లను అందించడమే కియా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇప్పటివరకు లీకైన ఫోటోలను గమనిస్తే, కియా సైరోస్ ఈవీ చాలా ఎత్తుగా, బాక్సీ డిజైన్‌తో చూడగానే ఆకట్టుకునేలా ఉంది. దీని ముందు భాగంలో లెఫ్ట్ సైడ్ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి క్లోజ్డ్ గ్రిల్, ప్రత్యేకంగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్‌తో ఇది పెట్రోల్ కార్ల కంటే భిన్నంగా కనిపిస్తుంది. కారు లోపల కూర్చునే ప్రయాణికులకు మంచి లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ లభించేలా కియా దీనిని తెలివిగా డిజైన్ చేసింది.
ఫీచర్ల విషయంలో కియా ఎప్పుడూ రాజీ పడదు. సైరోస్ ఈవీలో కూడా తన మార్కును చూపిస్తోంది. లోపల రెండు పెద్ద స్క్రీన్లతో కూడిన డిస్‌ప్లే, వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే వెెంటిలేటెడ్ సీట్లు, ఆకాశాన్ని చూస్తూ ప్రయాణించడానికి పెద్ద సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు మ్యూజిక్ ప్రియుల కోసం 8 స్పీకర్లతో కూడిన అద్భుతమైన సౌండ్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు. తన సెగ్మెంట్‌లో ఇది అత్యుత్తమ ఇంటీరియర్ కలిగిన కారుగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
కియా సైరోస్ EV రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో రాబోతున్నట్లు సమాచారం..
42kWh బ్యాటరీ: ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. సిటీ డ్రైవింగ్‌కు ఇది సరిగ్గా సరిపోతుంది.
49kWh బ్యాటరీ: ఎక్కువ దూరం ప్రయాణించే వారి కోసం దీనిని రూపొందించారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 400 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
కేవలం 30 నుంచి 40 నిమిషాల్లోనే కారును 80% వరకు ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉంది.
భద్రత విషయంలో కియా ఎక్కడా తగ్గలేదు. 6 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా మరియు ప్రమాదాలను ముందుగానే పసిగట్టే ADAS వంటి హై-ఎండ్ సేఫ్టీ ఫీచర్లను ఇందులో జోడిస్తున్నారు. ఇక ధర విషయానికి వస్తే, బేస్ మోడల్ రూ. 14 లక్షల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ రూ.20 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఇదే గనుక జరిగితే భారత్‌లో కియా నుంచి వచ్చే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఇదే అవుతుంది.