Land Rover : మెర్సిడెస్ G-వ్యాగన్‌కు పోటీగా ల్యాండ్ రోవర్ డిఫెండర్ ట్రోఫీ ఎడిషన్.. ఫీచర్లు చూస్తే షాక్

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ట్రోఫీ ఎడిషన్.. ఫీచర్లు చూస్తే షాక్;

Update: 2025-06-20 03:40 GMT

Land Rover : ల్యాండ్ రోవర్ తన పవర్ ఫుల్ ఎస్యూవీ డిఫెండర్ సరికొత్త వెర్షన్ ట్రోఫీ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. సాహసాలను ఇష్టపడేవారు, సవాళ్లతో కూడిన ప్రయాణాలలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని దీన్ని రూపొందించారు. ఈ ట్రోఫీ ఎడిషన్ ఎస్యూవీ ప్రత్యేకంగా ఆఫ్‌రోడింగ్‌ను ఇష్టపడే వారికి, డిఫెండర్ క్లాసిక్ లుక్‌ను మెచ్చే వారికోసం తయారు చేయబడింది. ఇది స్టాండర్డ్ డిఫెండర్ 110 మోడల్‌పై ఆధారపడి ఉన్నప్పటికీ ఇందులో అనేక స్పెషల్ అప్ డేట్స్ ఉన్నాయి.

ఈ ఎస్యూవీని రెండు స్పెషల్ రంగుల్లో రిలీజ్ చేశారు. డీప్ సాండ్‌గ్లో ఎల్లో, కెస్విక్ గ్రీన్. ఈ రెండు రంగులు పాత డిఫెండర్ మోడళ్లను గుర్తుకు తెస్తాయి. అవి అడవులలో, మారుమూల ప్రాంతాల్లో ఉపయోగించారు. వీటితో పాటు ఇది మాట్ ప్రొటెక్టివ్ ఫిల్మ్ ఆప్షన్ తో వస్తుంది. ఇది ఆఫ్‌రోడ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా గీతలు, రాపిడి నుండి వాహనాన్ని రక్షిస్తుంది.

SUV బోనెట్, సైడ్స్, బ్రేక్ కాలిపర్స్, వెనుక రికవరీ పాయింట్స్‌పై గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది మరింత స్ట్రాంగ్ లుక్‌ను ఇస్తుంది. అంతేకాకుండా, బోనెట్, C-పిల్లర్స్, వెనుక బ్యాజింగ్‌పై ప్రత్యేక ట్రోఫీ ఎడిషన్ డెకాల్స్ అతికించారు, ఇది వాహనానికి మరింత స్పెషల్ లుక్ ఇస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ లో 20-అంగుళాల గ్లోస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ అమర్చబడి ఉన్నాయి. ఇవి అన్ని రకాల రోడ్లపై సురక్షితంగా వెళ్ళడానికి ఆల్-టెర్రైన్ టైర్స్‌తో వస్తాయి. వీటితో పాటు ఇందులో డార్క్ రియర్ స్కఫ్ ప్లేట్, బ్లాక్ వీల్ ఆర్చెస్ రక్షణ, బ్లాక్ ఫ్రంట్ అండర్‌షీల్డ్ కూడా ఉన్నాయి. ఇవి ఆఫ్‌రోడ్ కోసం వాహనం మరింత రెడీగా ఉన్నట్లు అనిపిస్తాయి.

ఇందులో అదనపు సామాను ఉంచడానికి ఎక్స్‌పెడిషన్ రూఫ్ ర్యాక్, పైకప్పుపై సామాను చేరవేయడానికి బ్లాక్ రూఫ్ లాడర్, తడి లేదా బురద వస్తువులను తీసుకెళ్లడానికి సైడ్ గేర్ క్యారియర్, దుమ్ము ప్రాంతాలలో మెరుగైన గాలి వడపోత కోసం రైజ్డ్ ఎయిర్ ఇన్‌టేక్, వాహనాన్ని బురద నుండి రక్షించడానికి క్లాసిక్ ఫ్రంట్, రియర్ మడ్ ఫ్లాప్స్ అందించారు.

వాహనం లోపల డిఫెండర్ పటిష్టమైన డిజైన్ అలాగే ఉంచింది. ఇందులో ఎబోనీ విండ్సర్ లెదర్ అపోల్స్ట్రీ, ఇల్యూమినేటెడ్ ట్రెడ్‌ప్లేట్స్, బాడీ కలర్‌తో సరిపోలిన క్రాస్ కార్ బీమ్ ఉన్నాయి. దీని ఎండ్‌క్యాప్స్‌పై ట్రోఫీ బ్రాండింగ్ చేశారు. ఇది దాని స్పెషాలిటీని మరింత బలోపేతం చేస్తుంది. వాహనం ఇంజిన్, మెకానికల్ సిస్టమ్‌లలో ఎటువంటి మార్పులు చేయలేదు. వాటిని యథాతథంగా ఉంచారు. అయితే, సుదూర అడ్వెంచర్ ప్రయాణాలు చేయాలనుకునే వారికి, క్లాసిక్ ఆఫ్‌రోడ్ స్టైల్‌ను ఇష్టపడే వారికి ఈ ఎడిషన్ ఖచ్చితంగా సరిపోతుంది. ఇది మెర్సిడెస్ G-వ్యాగన్‌కు ఒక ఆల్టర్నేటివ్ గా ఉంటుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News