Mahindra : ఎస్‌యూవీ మార్కెట్లో మహీంద్రా మెగా ప్లాన్.. 2027లో రాబోతున్న రెండు సరికొత్త మోడల్స్

2027లో రాబోతున్న రెండు సరికొత్త మోడల్స్

Update: 2026-06-30 13:16 GMT

Mahindra : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీల రారాజుగా పేరొందిన మహీంద్రా అండ్ మహీంద్రా భవిష్యత్తు కోసం భారీ స్కెచ్ వేసింది. తన పొజిషన్‌ను మరింత పదిలం చేసుకునేందుకు 2027 సంవత్సరంలో రెండు సరికొత్త ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇందులో ఒకటి మహీంద్రా విజన్ ఎస్ కాగా, మరొకటి మహీంద్రా విజన్ ఎస్‌ఎక్స్‌టీ. ఈ రెండు వాహనాలను కంపెనీ సరికొత్తగా అభివృద్ధి చేసిన NU_IQ మోడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయబోతోంది. ఇటీవల కంపెనీ ప్రదర్శించిన విజన్ ఎస్, విజన్ ఎక్స్, విజన్ టి కాన్సెప్ట్ మోడళ్లలో ఈ ప్లాట్‌ఫామ్‌ను మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు.

స్కార్పియో-ఎన్ ఫ్యామిలీ నుంచి చిన్న ఎస్‌యూవీ

కొత్తగా రాబోతున్న మహీంద్రా విజన్ ఎస్ కారును కంపెనీకి చెందిన పాపులర్ స్కార్పియో-ఎన్ సిరీస్‌లో భాగరనంగా తీసుకొస్తున్నారు. ఇది సబ్-4 మీటర్ కేటగిరీలో రాబోతోంది. దీని డిజైన్ చాలా రగ్గడ్‌గా, బాక్సీ షేప్‌లో, పవర్‌ఫుల్ లుక్‌తో ఉండబోతోంది. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ కారు ప్రొడక్షన్ మోడల్‌ను 2026 చివరి నాటికి ప్రజల ముందుకు తెచ్చి, 2027 ప్రారంభంలో దీని విక్రయాలను అధికారికంగా మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇక మరో మోడల్ అయిన విజన్ ఎస్‌ఎక్స్‌టీ విషయానికి వస్తే, ఇది ఒక లగ్జరీ లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్ లాగా ఉండబోతోంది. దీని డిజైన్ పెటెంట్‌ను కూడా మహీంద్రా ఇప్పటికే ఫైల్ చేసింది.

ఒకే ప్లాట్‌ఫామ్.. ఎన్నో ఇంజన్ ఆప్షన్లు

మహీంద్రా తీసుకొస్తున్న ఈ కొత్త NU_IQ ప్లాట్‌ఫామ్ అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇది మల్టీ-ఫ్యూయల్ ఆప్షన్లను సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ ప్లాట్‌ఫామ్‌పై పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో పాటు హైబ్రిడ్, పూర్తి ఎలక్ట్రిక్ వాహనాలను కూడా తయారు చేయవచ్చు. దీనివల్ల కస్టమర్లు తమ బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా నచ్చిన మోడల్‌ను ఎంచుకునే వీలుంటుంది. ఆఫ్‌రోడింగ్ మరియు కఠినమైన రోడ్లపై ప్రయాణించేందుకు వీలుగా ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా, వేరియబుల్ రేషియో స్టీరింగ్, 5-లింక్ రియర్ సస్పెంక్షన్, యాక్టివ్ డాంపర్స్, సరికొత్త NU_UX యూజర్ ఇంటర్‌ఫేస్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి.

విజన్ ఎస్, విజన్ ఎస్‌ఎక్స్‌టీల డిజైన్ ఎలా ఉంది?

మహీంద్రా విజన్ ఎస్ కారు ఎత్తైన రూఫ్, స్ట్రెయిట్ బాడీ లైన్స్, గుండ్రటి ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌తో రానుంది. కాన్సెప్ట్ మోడల్లో చూపించిన రూఫ్ లైట్లు, బోనెట్ యాక్సెసరీస్ వంటివి ప్రొడక్షన్ మోడల్లో బేస్ వేరియంట్లకు ఉండకపోవచ్చు. దీని బేస్ మోడల్స్ లో అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మాన్యువల్ ఏసీ, స్ప్లిట్-ఫోల్డింగ్ సీట్లు ఉంటాయి. మరోవైపు విజన్ ఎస్‌ఎక్స్‌టీ పికప్ ట్రక్ లుక్ భారీ ఫ్రంట్ గ్రిల్, స్కిడ్ ప్లేట్, Y-షేప్ ఎల్ఈడీ డీఆర్‌ఎల్స్, భారీ బంపర్‌తో అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. దీని లోపల పెద్ద వర్టికల్ టచ్‌స్క్రీన్, డిజిటల్ మీటర్, పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News