Mahindra Scorpio-N : మహీంద్రా స్కార్పియో-ఎన్ కొత్త అవతారం..లగ్జరీ ఫీచర్లతో ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్

లగ్జరీ ఫీచర్లతో ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్

Update: 2026-02-14 09:55 GMT

Mahindra Scorpio-N : స్కార్పియో అంటేనే ఒక బ్రాండ్. మొదటి తరం నుంచి నేటి స్కార్పియో-ఎన్ వరకు ఈ కారుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు రాబోయే ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం ప్రైమ్ ఈ కార్ అనే యూట్యూబ్ ఛానల్ ఒక ఊహాజనిత చిత్రాన్ని రూపొందించింది. ఇది కేవలం కల్పితమే అయినప్పటికీ, మహీంద్రా గతంలో చూపించిన గ్లోబల్ పిక్ అప్ కాన్సెప్ట్ ఆధారంగా దీనిని డిజైన్ చేశారు. ముఖ్యంగా దీని ముందు భాగం చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కొత్త స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రధాన మార్పు దాని ఫ్రంట్ గ్రిల్. పాత వెర్టికల్ స్లాట్‌లకు బదులుగా, ఇప్పుడు గ్లోస్ బ్లాక్ బోర్డర్‌తో కూడిన విశాలమైన హనీకోంబ్ గ్రిల్ వచ్చే అవకాశం ఉంది. ఇది కారుకు ఒక రకమైన మ్యాకో లుక్‌ను ఇస్తుంది. హెడ్‌లైట్ల డిజైన్ ప్రస్తుత మోడల్ లాగే ఉన్నప్పటికీ, ఎల్ఈడీ డిఆర్ఎల్స్, బంపర్ డిజైన్‌లో చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త 18-ఇంచుల అల్లాయ్ వీల్స్ కారుకు మరింత అందాన్ని ఇస్తాయి.

కారు లోపలి భాగం మరింత లగ్జరీగా మారనుంది. ప్రస్తుతం ఉన్న 8-ఇంచుల టచ్‌స్క్రీన్‌కు బదులుగా, మహీంద్రా థార్ రాక్స్‎లో ఉన్నటువంటి 10.25-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రీమియం సీట్ కవర్లతో కేబిన్ రిచ్‌గా కనిపిస్తుంది. అంతేకాకుండా, కస్టమర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న పనోరమిక్ సన్‌రూఫ్ ఈ ఫేస్‌లిఫ్ట్ ద్వారా రావచ్చని ఊహిస్తున్నారు. మహీంద్రా తన కొత్త కార్లలో సేఫ్టీకి పెద్దపీట వేస్తోంది. స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్‌లో లెవెల్ 2 ADAS (Advanced Driver Assistance Systems) ఉండే అవకాశం ఉంది. ఇందులో లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. వీటికి తోడు 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటివి ప్రయాణాన్ని మరింత సురక్షితం చేస్తాయి.

మెకానికల్ పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇది ఇప్పటికే ఉన్న 2.0 లీటర్ టర్బో-పెట్రోల్, 2.2 లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతోనే రానుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లతో పాటు, డీజిల్ వేరియంట్లలో 4x4 ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ధర విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న రూ.13.49 లక్షల నుంచి రూ.24.34 లక్షల రేంజ్ కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.

Tags:    

Similar News