Mahindra : మహీంద్రా నుంచి డబుల్ ధమాకా.. కొత్త హంగులతో స్కాన్పియో-N, థార్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్

కొత్త హంగులతో స్కాన్పియో-N, థార్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్

Update: 2026-03-23 07:23 GMT

Mahindra : మహీంద్రా తన మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీలు స్కాన్పియో-N, థార్ లను సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 2026 నాటికి ఈ రెండు దిగ్గజ వాహనాలు రోడ్లపైకి రానున్నాయి. ఇంజిన్ పవర్ మునుపటిలాగే ఉన్నప్పటికీ, డిజైన్, లగ్జరీ ఫీచర్ల విషయంలో ఈసారి మహీంద్రా భారీ మార్పులు చేస్తోంది. ముఖ్యంగా థార్ రాక్స్ నుంచి స్ఫూర్తి పొందిన ఫీచర్లను ఈ కొత్త మోడళ్లలో మనం చూడవచ్చు.

స్కాన్పియో-N ఫేస్‌లిఫ్ట్

మహీంద్రా స్కాన్పియో-N ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఈసారి టెక్నాలజీకి పెద్దపీట వేశారు. బయటి వైపు కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, సరికొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉండబోతున్నాయి. అయితే అసలైన మార్పు ఇంటీరియర్‌లో ఉంది.వినియోగదారుల కోరిక మేరకు ఈసారి పెద్ద సన్‌రూఫ్ వచ్చే అవకాశం ఉంది. 10.25-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీల కెమెరా రానున్నాయి. ఇందులో Level 2 ADAS టెక్నాలజీని కూడా జోడించే అవకాశం ఉందని సమాచారం.

థార్ ఫేస్‌లిఫ్ట్

3-డోర్ థార్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు తన పెద్దన్న థార్ రాక్స్ పోలికలతో రానుంది. ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని అలాగే ఉంచుతూ కంఫర్ట్ పెంచారు. దీనికి కూడా రాక్స్ లాంటి సర్క్యులర్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్లు, సి-షేప్డ్ డీఆర్ఎల్స్, కొత్త స్టైల్ గ్రిల్ రాబోతున్నాయి. పుష్-బటన్ స్టార్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌వీఎమ్, వెంట్ లేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో చేరనున్నాయి. కొత్త 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఇది మునుపటి కంటే మరింత రఫ్ అండ్ టఫ్ గా కనిపించనుంది.

పవర్‌ట్రెయిన్, పర్ఫార్మెన్స్

ఇంజిన్ల విషయానికి వస్తే.. రెండింటిలోనూ పెద్దగా మార్పులు ఉండవు. స్కాన్పియో-N లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లు కొనసాగుతాయి. థార్ లో కూడా 1.5 లీటర్ డీజిల్, 2.2 లీటర్ డీజిల్, 2.0 లీటర్ పెట్రోల్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అలాగే ఉంటాయి. 2026 మధ్య నాటికి ఇవి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News