Mahindra Vision S : స్కార్పియో లుక్, అదిరిపోయే ఫీచర్లు..మహీంద్రా విజన్ ఎస్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది

మహీంద్రా విజన్ ఎస్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది

Update: 2026-02-14 09:56 GMT

Mahindra Vision S : మహీంద్రా తన ఎస్‌యూవీ సామ్రాజ్యాన్ని మరింత విస్తృతం చేస్తోంది. తాజాగా టెస్టింగ్‌లో కనిపించిన విజన్ ఎస్ మోడల్‌ను కంపెనీ 2027 నాటికి మార్కెట్లోకి తెచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మహీంద్రా కార్లు భారీగా, లాడర్-ఫ్రేమ్ ప్లాట్‌ఫారమ్‌పై ఉంటాయి. కానీ విజన్ ఎస్ మాత్రం కంపెనీ కొత్తగా డెవలప్ చేసిన NU_IQ మోనోకాక్ ప్లాట్‌ఫారమ్పై తయారవుతోంది. దీనివల్ల కారు బరువు తక్కువగా ఉండటమే కాకుండా, సిటీ రోడ్లపై డ్రైవింగ్ చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. కంఫర్ట్ కోరుకునే పట్టణ వాసులకు ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

రిపోర్ట్స్ ప్రకారం..ఈ విజన్ ఎస్ ఎస్‌యూవీని మహీంద్రా తన స్కార్పియో-ఎన్, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ మధ్య ప్లేస్ చేయనుంది. లీకైన ఫోటోలను గమనిస్తే ఇది పక్కా బాక్సీ లుక్‌తో, ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. స్క్వేర్ షేప్ విండోస్, వెడల్పాటి వీల్ ఆర్చ్‌లు, వెనుక వైపు అమర్చిన స్పేర్ వీల్ (స్టెప్నీ) దీనికి రియల్ ఎస్‌యూవీ ఫీల్‌ని ఇస్తున్నాయి. స్కార్పియో-ఎన్ అంత పెద్దది కాకపోయినా, దాని స్టైల్, దమ్మును ఇది కలిగి ఉంటుంది. దీనివల్ల ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవ్ చేయవచ్చు.

కారు లోపలి భాగం కూడా అత్యంత ఆధునికంగా ఉండబోతోంది. ఇందులో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అంతేకాకుండా అన్ని సీట్లకు అడ్జస్టబుల్ హెడ్-రెస్టులు, రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, ప్రయాణికుల రక్షణ కోసం మూడు-పాయింట్ సీట్ బెల్టులను స్టాండర్డ్‌గా అందించనున్నారు. కారులోపల ప్రీమియం ఫినిషింగ్‌తో పాటు ప్రయాణికుల కోసం అసిస్ట్ హ్యాండిల్స్ వంటి చిన్న చిన్న సౌకర్యాలపై కూడా మహీంద్రా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

విజన్ ఎస్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓలో వాడే పవర్‌ఫుల్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉండవచ్చు. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. సేఫ్టీ విషయంలో మహీంద్రా ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వదు. అందుకే విజన్ ఎస్ కూడా భవిష్యత్తులో Bharat NCAP, Global NCAP క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ సాధించేలా పటిష్టమైన బాడీ స్ట్రక్చర్‌తో రూపొందుతోంది. స్కార్పియో లాంటి లుక్ కావాలి.. కానీ సిటీలో తిరగడానికి అనుకూలంగా ఉండాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Tags:    

Similar News