Mahindra XUV 7XO : అదిరిపోయే 4 ఫీచర్లతో లగ్జరీ కార్లకే చెక్..మహీంద్రా XUV 7XO వచ్చేస్తోంది
మహీంద్రా XUV 7XO వచ్చేస్తోంది
Mahindra XUV 7XO : మహీంద్రా తన ఎస్‌యూవీ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే XUV700తో మార్కెట్‌ను ఏలుతున్న మహీంద్రా, ఇప్పుడు దానికి మరింత పవర్‌ఫుల్, లగ్జరీ అప్‌డేట్ ఇస్తూ XUV 7XOను తీసుకురాబోతోంది. జనవరి 5, 2026న గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న ఈ కారు, కేవలం పేరు మార్పు మాత్రమే కాదు.. ఫీచర్ల పరంగా ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతోంది. మహీంద్రా ఇటీవల విడుదల చేసిన టీజర్ల ప్రకారం.. ఈ కొత్త ఎస్‌యూవీలో ఉండబోయే 4 అదిరిపోయే ఫీచర్లు కస్టమర్ల మైండ్ బ్లాక్ చేయడం ఖాయం.
మహీంద్రా తన కొత్త నామకరణ పద్ధతిలో భాగంగా XUV300ని XUV 3XOగా మార్చినట్లే, ఇప్పుడు XUV700ని XUV 7XOగా రీ-బ్రాండ్ చేస్తోంది. ఇది చూడటానికి మహీంద్రా యొక్క భవిష్యత్తు ఎలక్ట్రిక్ కార్ల (XEV 9S వంటివి) డిజైన్ ఎలిమెంట్స్‌ను పోలి ఉంటుంది. కేవలం బాహ్య రూపమే కాకుండా, కారు లోపల ఉండే సౌకర్యాలు అల్ట్రా-లగ్జరీ కార్లను తలపించేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో వస్తున్న 'ట్రిపుల్ స్క్రీన్' సెటప్ ఇండియాలో ఏ ఇతర ఎస్‌యూవీలోనూ లేని విధంగా ఉండబోతోంది.
XUV 7XO లోని ఆ 4 అదిరిపోయే ఫీచర్లు ఇవే
పావర్డ్ బాస్ మోడ్ : కారు వెనుక సీట్లో కూర్చునే వారికి ఇది ఒక వరం. ఒకే ఒక్క బటన్ నొక్కడం ద్వారా ముందున్న కో-ప్యాసింజర్ సీటును ఎలక్ట్రిక్ పద్ధతిలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల వెనుక కూర్చునే వారికి కాళ్లు చాపుకోవడానికి చాలా ఎక్కువ స్థలం దొరుకుతుంది. విలాసవంతమైన ప్రయాణాన్ని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఫీచర్.
ట్రిపుల్ స్క్రీన్ డాష్‌బోర్డ్ : ఈ కారులోని డాష్‌బోర్డ్ చూడటానికి ఒక స్పేస్ షిప్‌లా ఉంటుంది. ఇందులో ఏకంగా మూడు స్క్రీన్‌లు ఉంటాయి. రెండు 12.3-ఇంచుల టచ్‌స్క్రీన్‌లు (ఒకటి సెంటర్లో, మరొకటి ప్యాసింజర్ సైడ్), ఒక పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో ఉండబోతున్నాయి. డ్రైవర్ పక్కన కూర్చునే వారు కూడా తమకు నచ్చిన సినిమాలు లేదా మ్యాప్స్‌ను తమ సొంత స్క్రీన్‌పై చూసుకోవచ్చు.
16-స్పీకర్ల హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్: మ్యూజిక్ లవర్స్ కోసం మహీంద్రా భారీ అప్‌గ్రేడ్ ఇచ్చింది. XUV700లో ఉన్న 12-స్పీకర్ల సోనీ సిస్టమ్ స్థానంలో, ఇప్పుడు 16-స్పీకర్ల Harman Kardon ఆడియో సిస్టమ్‌ను తీసుకొస్తున్నారు. ఇది కారు లోపల ఒక థియేటర్ లాంటి అనుభూతిని ఇస్తుంది.
BYOD (Bring Your Own Device) డాక్: వెనుక సీట్లలో ప్రయాణించే వారు తమ టాబ్లెట్స్ లేదా ఫోన్లను పెట్టుకోవడానికి ప్రత్యేకమైన డాక్‌లను సీట్ల వెనుక ఇచ్చారు. అంతేకాకుండా, వీటిని వేగంగా ఛార్జ్ చేసుకోవడానికి 65W USB Type-C పోర్ట్‌లను కూడా అమర్చారు. దీనివల్ల ప్రయాణంలో పని చేసుకునే వారికి లేదా పిల్లలు బొమ్మలు చూసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
మొత్తానికి మహీంద్రా XUV 7XOతో లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తోంది. జనవరి 5న దీని ధరలు, మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.