Maruti Baleno: సెప్టెంబర్ 5న మార్కెట్లోకి మారుతి బలేనో ఫేస్‌లిఫ్ట్.. సన్‌రూఫ్, క్రేజీ లుక్స్‌తో ఎంట్రీ
సన్‌రూఫ్, క్రేజీ లుక్స్‌తో ఎంట్రీ
Maruti Baleno: భారతీయ కార్ల మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన మారుతి సుజుకి బలేనో మరోసారి కొత్త రూపు సంతరించుకుంటోంది. 2022లో వచ్చిన సెకండ్ జనరేషన్ మోడల్ తర్వాత కంపెనీ ఇప్పుడు భారీ మార్పులతో ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను తీసుకొస్తోంది. సెప్టెంబర్ 5న ఈ మోడల్‌ను రోడ్లపైకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించిన ఆధారాల ప్రకారం ఈ కారు డిజైన్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు మారుతి ఈసారి మోడరన్ ఫీచర్లపై ఎక్కువ దృష్టి పెట్టింది.
ఫ్రంట్ డిజైన్‌లో మెరుపులు.. అలాయ్ వీల్స్ ధమాకా
కొత్త బలేనో ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో వినూత్న మార్పులు కనిపిస్తున్నాయి. కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, దానికి అనుసంధానంగా క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చి రెండు హెడ్‌లాంప్‌లను కలిపే హారిజాంటల్ ఎలిమెంట్ ఆకట్టుకుంటోంది. ప్రామాణిక హెడ్‌లాంప్ ఆకారం, బూమరాంగ్ తరహా ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు పాత మోడల్ తరహాలోనే కొనసాగే అవకాశం ఉంది. ఫ్రంట్ బంపర్‌ను పూర్తిగా రీడిజైన్ చేశారు. పక్క భాగంలో సరికొత్త డిజైన్ కలిగిన అలాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వెనుక వైపు బంపర్‌లో స్వల్ప మార్పులు మినహా స్పాయ్లర్, వైపర్ వంటివి పాత తరహాలోనే ఉంటాయి.
ఇంటీరియర్‌లో సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్
కారు లోపలి భాగం కేవలం లుక్స్ పరంగానే కాకుండా సౌకర్యాల పరంగానూ అప్‌గ్రేడ్ అయింది. డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, 9-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ యథాతథంగా ఉంటాయి. ఈసారి సరికొత్త సీట్ అపోల్స్టరీ, మూడ్ లైటింగ్ ఇచ్చే యాంబియంట్ లైటింగ్, కస్టమర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న సింగిల్-పేన్ సన్‌రూఫ్ ఫీచర్‌ను జోడించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6-స్పీకర్ ఆడియో సిస్టమ్, అడ్జస్టబుల్ ఓఆర్‌విఎమ్‌లు యథావిధిగా అందుబాటులో ఉంటాయి.
ఇంజిన్ పవర్.. నమ్మకమైన మైలేజ్
సాంకేతిక విభాగంలో పెద్దగా మార్పులు చేసే ఆలోచనలో కంపెనీ లేదు. సుపరిచితమైన 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించనున్నారు. ఇది 90hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్లు లభిస్తాయి. సీఎన్‌జీ మోడల్‌లో ఇదే ఇంజిన్ 77.5hp పవర్‌ను ఇస్తూ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. ఎస్‌యూవీల హవా నడుస్తున్న కాలంలోనూ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో బలేనో సాధిస్తున్న విక్రయాలు కంపెనీకి కొండంత కొండంత భరోసానిస్తున్నాయి.