Maruti Suzuki : మారుతి సుజుకీ బంపర్ ఆఫర్.. ఆ కార్లపై ఏకంగా రూ.85,000ల తగ్గింపు
ఆ కార్లపై ఏకంగా రూ.85,000ల తగ్గింపు;
Maruti Suzuki : దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థలలో ఒకటైన మారుతి సుజుకి, వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ తమ వివిధ కార్ల మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ల రూపంలో ఎన్నో గొప్ప తగ్గింపులను అందిస్తోంది. కొత్త కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నవాళ్లకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే, ఈ ఆఫర్లు సిటీని బట్టి మారుతాయి. కాబట్టి, దగ్గరలోని డీలర్‌షిప్‌లో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
మారుతి సుజుకి ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లపై మంచి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆల్టో K10, సెలెరియో మాన్యువల్ వేరియంట్లపై రూ.35,000, AMT వేరియంట్లపై రూ.40,000 క్యాష్ ఆఫర్ లభిస్తుంది. వీటితో పాటు, అదనంగా రూ.2,100 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అలాగే, ఎస్-ప్రెస్సో మాన్యువల్ వేరియంట్లపై రూ.30,000 వరకు, AMT వేరియంట్లపై రూ.35,000 వరకు ఆఫర్ లభిస్తుంది. ఈ కార్లపై కూడా రూ.2,100 కార్పొరేట్ డిస్కౌంట్ అదనంగా పొందవచ్చు.
వాగన్ ఆర్ మాన్యువల్ వేరియంట్లపై రూ.35,000 వరకు, AMT వేరియంట్లపై రూ.40,000 వరకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తోంది. పాత వాగన్ ఆర్ కారును ఎక్స్ఛేంజ్ చేసే కస్టమర్లకు రూ.40,000 అదనపు అప్‌గ్రేడ్ డిస్కౌంట్, రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. స్విఫ్ట్ కొనుగోలుపై రూ.25,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. పాత స్విఫ్ట్ కారును ఎక్స్ఛేంజ్ చేసే వారికి రూ.50,000 అప్‌గ్రేడ్ బోనస్, అదనంగా రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈకో పెట్రోల్ వేరియంట్‌పై రూ.15,000, సీఎన్జీ మోడల్‌పై రూ.10,000 తగ్గింపు ఇస్తున్నారు.
మారుతి సుజుకి SUV, MPV మోడళ్లపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బ్రెజ్జా పెట్రోల్ వేరియంట్‌పై రూ.10,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 కార్పొరేట్ బెనిఫిట్ లభిస్తుంది. ఎర్టిగా MPVపై ఈ నెలలో రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తోంది మారుతి.
ఆల్టో, ఎస్-ప్రెస్సో, వాగన్ ఆర్, సెలెరియో, స్విఫ్ట్, ఈకో, బ్రెజ్జా వంటి మోడళ్లపై రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. మీ పాత కారు 15 సంవత్సరాల కన్నా పాతదై, దాన్ని స్క్రాప్ చేయిస్తే, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.25,000 వరకు పెరుగుతుంది. 3 సంవత్సరాల వరకు పాత కార్లను ఎక్స్ఛేంజ్ చేసుకునే కస్టమర్లకు వాగన్ ఆర్, స్విఫ్ట్‌పై ప్రత్యేక అప్‌గ్రేడ్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ జూన్ నెల ఆఫర్లతో మారుతి సుజుకి కార్లను కొనుగోలు చేసే వినియోగదారులు నేరుగా రూ.85,000 వరకు ఆదా చేసుకునే గొప్ప అవకాశాన్ని పొందవచ్చు. ఈ ఆఫర్లు లిమిటెడ్ టైం మాత్రమే అందుబాటులో ఉంటాయి.Maruti Suzuki, June offers, car discounts, Alto K10, Celerio, S-Presso, Wagon R, Swift, Eeco, Brezza, Ertiga, exchange bonus