Maruti Suzuki : మారుతి నెక్సా కార్లపై ఆఫర్ల జాతర.. ఏప్రిల్ లో ఏకంగా లక్షల్లో డిస్కౌంట్లు

ఏప్రిల్ లో ఏకంగా లక్షల్లో డిస్కౌంట్లు

Update: 2026-04-07 11:22 GMT

Maruti Suzuki : ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు మారుతి సుజుకి హవా నడుస్తోంది. తన ప్రీమియం కార్ల విక్రయ కేంద్రాలైన నెక్సా నెట్‌వర్క్ ద్వారా విక్రయించే కార్లపై ఏప్రిల్ 2026లో అదిరిపోయే డిస్కౌంట్లను కంపెనీ ప్రకటించింది. సాధారణంగా అరీనా, నెక్సా అనే రెండు ఛానళ్ల ద్వారా మారుతి కార్లను అమ్ముతుందన్న సంగతి తెలిసిందే. ఇందులో నెక్సా అనేది లగ్జరీ, ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారి కోసం ప్రత్యేకించబడింది. ప్రస్తుతం నెక్సా లైనప్‌లో ఉన్న ఇగ్నిస్, బాలెనో, ఫ్రాంక్స్, జిమ్నీ, ఎక్స్‌ఎల్6, గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి కార్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఫ్రాంక్స్, జిమ్నీలపై అదిరిపోయే ఆఫర్లు

మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారుపై ఈ నెలలో టర్బో-పెట్రోల్ వేరియంట్లలో ఏకంగా రూ.40,000 వరకు నగదు తగ్గింపు లభిస్తోంది. అయితే, నేచురల్లీ ఆస్పిరేటెడ్ వేరియంట్లకు ఈ నగదు తగ్గింపు వర్తించదు. కానీ, అన్ని వేరియంట్లపై రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మాత్రం లభిస్తుంది. ఇక ఆఫ్-రోడింగ్ అంటే ప్రాణం ఇచ్చే వారికి జిమ్నీ ఒక గొప్ప అవకాశం. ఈ కారుపై ఏకంగా రూ.50,000 డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది అడ్వెంచర్ ప్రియులకు కచ్చితంగా పండగ లాంటి వార్తే.

గ్రాండ్ విటారా, ఎక్స్‌ఎల్6 రేట్లు తగ్గాయి

ఫ్యామిలీ కార్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్స్‌ఎల్6 మోడల్‌పై మొత్తం రూ.45,000 వరకు ప్రయోజనం లభిస్తోంది. ఇందులో రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ఇక ఎస్‌యూవీ ప్రియుల ఫేవరెట్ గ్రాండ్ విటారా విషయానికి వస్తే.. స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్‌పై రూ.25,000, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.20,000 క్యాష్ బెనిఫిట్ ఉంది. అంతేకాకుండా, కొన్ని వేరియంట్లపై 5 ఏళ్ల వారంటీతో పాటు రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్. రూ.20,000 అప్‌గ్రేడ్ బోనస్ కూడా ఇస్తున్నారు. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ అయితే ఏకంగా రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.30,000 అప్‌గ్రేడ్ బోనస్‌ను అందిస్తోంది.

ఇన్విక్టో పై కనీవినీ ఎరుగని రాయితీలు

నెక్సా నెట్‌వర్క్‌లోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఎంపీవీ ఇన్విక్టో పై ఈ ఏప్రిల్‌లో భారీ ఆఫర్లు ఉన్నాయి. కస్టమర్ బెనిఫిట్ కింద రూ.50,000, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.లక్ష, అప్‌గ్రేడ్ బోనస్ కింద మరో రూ.50,000 ఇస్తున్నారు. అంటే మొత్తం మీద భారీ మొత్తాన్ని ఆదా చేయవచ్చు. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా రూపొందిన ఈ కారు, తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండటం వల్ల కస్టమర్లకు ఇప్పుడు హాట్ కేక్ లా మారింది.

కొత్త కారు కొనేవారికి ఇదే సరైన సమయం

మారుతి సుజుకి తన సేల్స్ పెంచుకోవడానికి ఏప్రిల్ నెలలో ఈ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. నెక్సా షోరూమ్ ల ద్వారా ఈ ఆఫర్లు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. నగదు తగ్గింపులతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, అదనపు వారంటీ వంటి ప్రయోజనాలు కొత్త కారు కొనేవారిపై భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. మీ పాత కారును మార్చుకుని కొత్త కారు తీసుకోవాలనుకునే వారికి, ముఖ్యంగా ప్రీమియం మోడళ్లపై కన్ను వేసిన వారికి ఈ నెలలో మంచి డీల్స్ దొరుకుతాయి.

Tags:    

Similar News