Maruti Suzuki : రూ.3.50 లక్షలకే కారు..మైలేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..ఎగబడి కొంటున్న జనం

మైలేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..ఎగబడి కొంటున్న జనం

Update: 2026-01-02 02:32 GMT

Maruti Suzuki : మధ్యతరగతి భారతీయుడి సొంత కారు కలని నిజం చేయడంలో మారుతి సుజుకి ఎప్పుడూ ముందే ఉంటుంది. పెరిగిపోతున్న కార్ల ధరల మధ్య కూడా సామాన్యుడి బడ్జెట్‌కు తగ్గట్లుగా కార్లను అందిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా 2025 డిసెంబర్ నెలలో మారుతి సుజుకి తన సేల్స్‌తో దూసుకుపోయింది. ముఖ్యంగా దేశంలోనే అత్యంత చవకైన కార్లుగా పేరున్న ఆల్టో, ఎస్-ప్రెస్సో మోడళ్లను కొనడానికి జనం ఎగబడ్డారు. గత నెలలో ఈ రెండు కార్లను కలిపి ఏకంగా 14,225 మంది కొనుగోలు చేశారు. ఇది గతేడాది డిసెంబర్ అమ్మకాలతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం విశేషం.

మారుతి సుజుకి ఇండియాకు 2025 డిసెంబర్ నెల కాసుల వర్షం కురిపించింది. గతేడాది డిసెంబర్‌లో 1.78 లక్షల కార్లు అమ్ముడవ్వగా, ఈ ఏడాది అది 2.17 లక్షలకు పైగా చేరింది. ఇందులో కంపెనీ మినీ సెగ్మెంట్ కార్ల వాటా అద్భుతంగా ఉంది. ఆల్టో కె10 ప్రారంభ ధర కేవలం రూ.3.50 లక్షలు కాగా, ఎస్-ప్రెస్సో రూ.3.70 లక్షల నుంచి అందుబాటులో ఉంది. ఇంత తక్కువ ధరలో కారు లభిస్తుండటంతో సామాన్యులు తమ పాత బైకులను వదిలేసి మారుతి షోరూమ్‌ల వైపు క్యూ కడుతున్నారు.

మారుతి ఆల్టో కె10 ఇప్పుడు సరికొత్త హార్టెక్ ప్లాట్‌ఫారమ్‌పై తయారవుతోంది. ఇందులో 1.0 లీటర్ కె-సిరీస్ ఇంజిన్ ఉంది. దీని మైలేజ్ విషయానికి వస్తే, మ్యాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.39 కి.మీ, ఆటోమేటిక్ వేరియంట్ 24.90 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఇక సిఎన్‌జి వేరియంట్ అయితే ఏకంగా 33.85 కి.మీ మైలేజీని అందిస్తూ దేశంలోనే అత్యంత పొదుపైన కారుగా నిలిచింది. లోపల 7 ఇంచుల టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. సేఫ్టీ కోసం కంపెనీ ఇప్పుడు ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తోంది.

ఎస్-ప్రెస్సో కారు దాని ఎత్తైన బాక్సీ డిజైన్ వల్ల చిన్న ఎస్‌యూవీలా కనిపిస్తుంది. ఇందులో కూడా 1.0 లీటర్ ఇంజిన్ అమర్చారు. ఇది 68PS పవర్, 89Nm టార్క్ ఇస్తుంది. మైలేజ్ పరంగా పెట్రోల్ వేరియంట్ 24.76 కి.మీ, సిఎన్‌జి వేరియంట్ 32.73 కి.మీ మైలేజీ ఇస్తాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ విండోస్, కీ-లెస్ ఎంట్రీ, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఈ బడ్జెట్ కారులో ఉండటం విశేషం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లకు ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ప్లస్ అవుతోంది.

బడ్జెట్ కార్లంటే భద్రత ఉండదు అనే మాటను మారుతి ఇప్పుడు చెరిపివేస్తోంది. ఆల్టో, ఎస్-ప్రెస్సో రెండింటిలోనూ ఏబీఎస్ విత్ ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. తక్కువ ధరలో మంచి మైలేజీతో పాటు ఫ్యామిలీకి భద్రతను కూడా అందిస్తుండటంతో ఈ కార్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు బెస్ట్ ఛాయిస్ గా మారాయి.

Tags:    

Similar News