MG Majestor : రేపే ఎంజీ మెజెస్టర్ రాక.. ఫార్చ్యూనర్ పని ఖతం? అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఎస్‌యూవీ

అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఎస్‌యూవీ

Update: 2026-02-11 09:51 GMT

MG Majestor : భారతదేశ ఎస్‌యూవీ ప్రియులకు పండగ లాంటి వార్త. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన అత్యంత శక్తివంతమైన, విలాసవంతమైన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఎంజీ మెజెస్టర్‎ను ఫిబ్రవరి 12న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతోంది. ఇప్పటివరకు ఈ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగుతున్న టయోటా ఫార్చ్యూనర్‌కు చుక్కలు చూపించేందుకే ఈ కారు వస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. భారత్ ఎక్స్‌పో 2025లో తొలిసారి మెరిసిన ఈ మెజెస్టర్, పాత గ్లోస్టర్ స్థానాన్ని భర్తీ చేస్తూ మరింత హంగులతో రాబోతోంది.

ఎంజీ మెజెస్టర్ బయటి డిజైన్ చాలా అగ్రెసివ్‌గా, బోల్డ్‌గా ఉంది. దీని ముందు భాగంలో ఉన్న మ్యాట్రిక్స్ స్టైల్ గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు దీనికి ఒక రాజసాన్ని ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో 19 అంగుళాల భారీ అల్లాయ్ వీల్స్, మస్కులర్ ఆర్చ్‌లు ఈ కారును ఒక బీస్ట్‌లా చూపిస్తాయి. ఇది చైనా, సౌదీ మార్కెట్లలో ఉన్న మ్యాక్సస్ డి90 ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడింది, కాబట్టి దీని క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు.

కారు లోపలికి వెళ్తే మీరు ఒక విలాసవంతమైన హోటల్ రూమ్‌లోకి వెళ్లినట్లే ఉంటుంది. 12.3 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అదే సైజులో ఉండే డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే దీని ప్రత్యేకత. కారులో ఉన్నవారికి బోర్ కొట్టకుండా 12-స్పీకర్ల అదిరిపోయే ఆడియో సిస్టమ్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా, డ్రైవర్ మరియు పక్కనున్న సీట్లకు హీటింగ్, మసాజ్ ఫంక్షన్లు కూడా ఉన్నాయి. అంటే ప్రయాణం చేస్తూనే మసాజ్ చేయించుకోవచ్చన్నమాట. త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ ద్వారా ఎవరికి నచ్చిన టెంపరేచర్‌ను వారు సెట్ చేసుకోవచ్చు.

మెజెస్టర్‌లో పవర్‌ఫుల్ 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 212.5 బీహెచ్‌పీ పవర్‌ను, 478.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను జత చేశారు. ఇందులో త్రీ-మోడ్ ఆఫ్‌రోడ్ సిస్టమ్ ఉంది, ఇది ఎలాంటి కష్టమైన రోడ్లనైనా సునాయాసంగా దాటేస్తుంది. కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్టుగా రియర్ వీల్ డ్రైవ్ లేదా ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

సేఫ్టీ విషయంలో ఎంజీ మెజెస్టర్ లో ఏకంగా లెవల్ 2 ADAS ఫీచర్లు ఉన్నాయి. అంటే ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి మీ ప్రయాణాన్ని మరింత సురక్షితం చేస్తాయి. వీటితో పాటు 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి మోడ్రన్ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని ధర సుమారు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News