MG Motor : ఎంజీ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఏప్రిల్ నెలలో ఏ కారుపై ఎంత డిస్కౌంటంటే?
ఏప్రిల్ నెలలో ఏ కారుపై ఎంత డిస్కౌంటంటే?
MG Motor : కొత్త కారు కొనాలనుకునే వారికి ఎంజీ మోటార్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ 2026 నెలలో తన పాపులర్ ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. గ్లోస్టర్, హెక్టర్, జెడ్ఎస్ ఈవీ వంటి మోడళ్లపై లక్షల్లో ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా ఎంజీ గ్లోస్టర్ పై ఏకంగా రూ. 3.5 లక్షల వరకు తగ్గింపు ఇవ్వడం విశేషం.
1. ఎంజీ గ్లోస్టర్
ఈ నెలలో ఎంజీ కంపెనీ ఇస్తున్న అతిపెద్ద ఆఫర్ గ్లోస్టర్ ఎస్‌యూవీపైనే. ఈ భారీ ఎస్‌యూవీపై ఏకంగా రూ. 3.5 లక్షల నగదు తగ్గింపుతో పాటు రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. అంటే మొత్తంగా రూ. 3.7 లక్షల వరకు లాభం పొందవచ్చు. ఇందులో 2.0 లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఉంది, ఇది 161 PS పవర్‌ను, 373.5 Nm టార్క్‌ను అందిస్తుంది. లగ్జరీ ఎస్‌యూవీని తక్కువ ధరలో సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం.
2. ఎంజీ హెక్టర్
ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధరను కంపెనీ రూ. 11.99 లక్షల వద్దే స్థిరంగా ఉంచింది. ఇతర కంపెనీలు ధరలు పెంచుతున్నా, బేస్ వేరియంట్ ధర మార్చకపోవడం విశేషం. అయితే కొన్ని హై-ఎండ్ వేరియంట్లపై రూ. 30,000 వరకు ధర పెరిగింది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి హెక్టర్ ఒక నమ్మకమైన ఎంపిక.
3. ఎంజీ విండ్సర్, జెడ్ఎస్ ఈవీ
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఎంజీ విండ్సర్ పై రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ వెరసి రూ.40,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇది సింగిల్ ఛార్జ్ పై 449 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అలాగే ఎంజీ జెడ్ఎస్ ఈవీ పై కూడా మొత్తం రూ.40,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. 461 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఈ కారు ఈవీ ప్రియులకు బెస్ట్ ఆప్షన్.
4. ఎంజీ ఆస్టర్, కామెట్ ఈవీ
ఎంజీ ఆస్టర్ పై రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కలిపి రూ.45,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇక చిన్న ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్ ఈవీపై రూ.30,000 నగదు తగ్గింపు లభిస్తోంది. కేవలం సిటీ ప్రయాణాల కోసం కారు చూస్తున్న వారికి కామెట్ ఈవీ ఒక మంచి డీల్.