Tata Punch vs Hyundai Exter : టాటా పంచ్ Vs హ్యుందాయ్ ఎక్స్‌టర్.. మైక్రో ఎస్‌యూవీల పోరులో విజేత ఎవరు?

మైక్రో ఎస్‌యూవీల పోరులో విజేత ఎవరు?

Update: 2026-03-22 10:56 GMT

Tata Punch vs Hyundai Exter : భారతదేశంలో మైక్రో-ఎస్‌యూవీల హవా నడుస్తోంది. బడ్జెట్ ధరలో ఎస్‌యూవీ ఫీలింగ్ ఇచ్చే ఈ కార్ల సెగ్మెంట్లో ఇప్పుడు అసలైన యుద్ధం మొదలైంది. ఒకవైపు సేఫ్టీకి మారుపేరుగా నిలిచిన టాటా పంచ్, మరోవైపు స్టైలిష్ లుక్, లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్న 2026 హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్. ఈ రెండు కార్లలో ఏది మీ ఇంటికి రావాలి? దేనిలో ఫీచర్లు ఎక్కువ? మైలేజీలో ఏది తోపు? వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ధరల మధ్య పోటీ

ధర విషయానికి వస్తే, టాటా పంచ్ ప్రారంభ ధర రూ.5.59 లక్షల నుంచి మొదలై టాప్ వేరియంట్ రూ.10.54 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. అంటే బేస్ మోడల్ కొనాలనుకునే వారికి పంచ్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఇక 2026 హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ ధర సుమారు రూ.5.79 లక్షల నుంచి రూ.9.42 లక్షల మధ్య ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కావాలనుకునే వారికి ఎక్స్‌టర్ టాప్ మోడల్ కాస్త పొదుపుగా అనిపిస్తుంది.

ఇంజిన్, పర్ఫార్మెన్స్

రెండు కార్లలోనూ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. అయితే పవర్ లో చిన్న తేడాలు ఉన్నాయి. ఎక్స్‌టర్ 83 బీహెచ్‌పీ పవర్ ఇస్తుంటే, పంచ్ 87 బీహెచ్‌పీతో కొంచెం ఎగ్రెసివ్ గా ఉంటుంది. ముఖ్యంగా టాటా పంచ్ లో టర్బో పెట్రోల్ ఆప్షన్ కూడా ఉండటం వల్ల, వేగం కోరుకునే వారికి పంచ్ బెస్ట్ ఛాయిస్. అలాగే పంచ్ లో ఈవీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది, ఇది ఎక్స్‌టర్ లో ప్రస్తుతానికి లేదు.

డిజైన్, లుక్

కొత్త ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ లో డిజైన్ పరంగా చిన్న చిన్న మార్పులు చేశారు. బంపర్ పై ఉన్న EXTER అక్షరాలను ఇప్పుడు డీఆర్ఎల్ కనెక్టింగ్ ట్రిమ్ పైకి మార్చారు. గ్రిల్ వెడల్పు పెంచి సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది చూడటానికి చాలా మోడ్రన్ గా, సిటీ కార్ లా ఉంటుంది. మరోవైపు టాటా పంచ్ తన సిగ్నేచర్ బాక్సీ ఎస్‌యూవీ లుక్ ను అలాగే ఉంచింది. రోడ్డుపై వెళ్తుంటే ఒక చిన్న సైజు హారియర్ లాంటి గంభీరమైన రూపాన్ని ఇస్తుంది.

ఇంటీరియర్, ఫీచర్లు

లోపల ఫీచర్ల విషయానికొస్తే టాటా పంచ్ 10.25 ఇంచుల పెద్ద స్క్రీన్, వైర్‌లెస్ కనెక్టివిటీ, రియర్ ఆర్మ్‌రెస్ట్ వంటి సౌకర్యాలతో ముందు వరుసలో ఉంది. అయితే హ్యుందాయ్ ఎక్స్‌టర్ తన కేబిన్ లో నెవీ బ్లూ, గ్రే థీమ్ తో చాలా ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఎక్స్‌టర్ లో 391 లీటర్ల భారీ బూట్ స్పేస్ ఉంటుంది, పంచ్ లో ఇది 366 లీటర్లే. అంటే లగేజీ ఎక్కువగా పెట్టుకునే వారికి ఎక్స్‌టర్ బెటర్.

సేఫ్టీ లో ఎవరిది పైచేయి?

సేఫ్టీ అనగానే అందరికీ గుర్తొచ్చేది టాటా పంచ్. దీనికి భారత్ NCAP లో 5-స్టార్ రేటింగ్ లభించింది. 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో అదనం. ఇక ఎక్స్‌టర్ లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్స్, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి కీలక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. మొత్తం మీద సేఫ్టీ, పర్ఫార్మెన్స్ కావాలనుకునే వారు పంచ్ వైపు.. లేదు మాకు స్టైల్, మోడ్రన్ టెక్నాలజీ, ఎక్కువ లగేజీ స్పేస్ కావాలి అనుకునే వారు ఎక్స్‌టర్ వైపు మొగ్గు చూపవచ్చు.

Tags:    

Similar News