Mini India : జూన్ 17న మార్కెట్లోకి మిని కొత్త లగ్జరీ కార్.. ధర కూడా భారీగా తగ్గే ఛాన్స్
ధర కూడా భారీగా తగ్గే ఛాన్స్
Mini India : లగ్జరీ, ప్రీమియం కార్ల లవర్లకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మిని ఇండియా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తన సరికొత్త మోడల్ 2026 మిని కంట్రీమ్యాన్ సి ఎస్‌యూవీని జూన్ 17న భారత మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన ప్రీ-బుకింగ్స్ కూడా దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. మిని కంపెనీ ప్రస్తుత లైన్అప్‌లో ఉన్న హై-పర్ఫార్మెన్స్ మోడల్ కంట్రీమ్యాన్ జేసీడబ్ల్యూ ఆల్4కి దిగువన ఈ కొత్త కారును పొజిషన్ చేయనున్నారు. అయితే, ఈ కారును విదేశాల నుంచి నేరుగా ఇంపోర్ట్ చేసుకోకుండా, భారతదేశంలోనే లోకల్ అసెంబ్లీ ద్వారా తయారు చేయనున్నారు. దీనివల్ల పన్నుల భారం తగ్గి, కారు ధర చాలా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.
ఈ సరికొత్త కంట్రీమ్యాన్ సి డిజైన్ దాదాపుగా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారును పోలి ఉంటుంది. కానీ ఇందులో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, అప్‌డేటెడ్ బంపర్, మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఇవ్వబోతున్నారు. ఈ కారు బ్రిటీష్ రేసింగ్ గ్రీన్, చిలీ రెడ్, నానుక్ వైట్, స్లేట్ బ్లూ, స్మోకీ గ్రీన్ అనే 5 కలర్ ఆప్షన్లలో లభించనుంది. కారుకు మరింత క్లాస్ లుక్ ఇవ్వడానికి బ్లాక్ రూఫ్, బ్లాక్ ఓఆర్వీఎమ్, షాంపేన్ కలర్ ఎక్స్‌టీరియర్ ట్రిమ్స్ వాడారు.
ఈ కారు ఇంటీరియర్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. లోపల డ్యూయల్-టోన్ థీమ్‌తో పాటు మిని బ్రాండ్ సిగ్నేచర్ అయిన రౌండ్ షేప్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రీమియం సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, ప్యాడల్ షిఫ్టర్స్ వంటి ఎన్నో అడ్వాన్స్డ్ లగ్జరీ ఫీచర్లు ఇందులో డ్రైవింగ్ అనుభవాన్ని సరికొత్తగా మారుస్తాయి.
ఈ కారులో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్‌ను అమర్చే అవకాశం ఉంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇదే ఇంజన్‌ను బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1లో కూడా వాడుతున్నారు. ఇది మార్కెట్లోకి వచ్చాక బీఎమ్‌డబ్ల్యూ X1, ఆడి Q3, మెర్సిడెస్ బెంజ్ GLA వంటి లగ్జరీ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న జేసీడబ్ల్యూ ఆల్4 ధర రూ.64.9 లక్షలు కాగా, ఈ కొత్త కారు ధర అంతకంటే తక్కువగా ఉండబోతోంది.